ది క్రీక్ ప్లానెట్ స్కూల్ వార్షికోత్సవం
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): ప్రపంచ సంస్కృతుల(world cultures) వైవిధ్యం, శాంతి, ఐక్యత, పరస్పర గౌరవం అనే సందేశాన్ని చాటుతూ ది క్రీక్ ప్లానెట్ స్కూల్(Creek Planet School) సీనియర్ సీడ్స్ క్యాంపస్ వార్షికోత్సవం ‘సంగమ్2026’ ఘనంగా నిర్వహించారు. ‘విశ్వోత్సవ్ సంస్కృతి(Vishwotsav Culture), శాంతి, ఐక్యతల సంగీత సమ్మేళనం’ ఇతివృత్తంతో బౌరంపేట్లోని(Bowrampet) అంబిటస్ వరల్ స్కూల్(Ambitus World School) వేదికగా జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు(Students) తమ కళాత్మక ప్రతిభతో ఆకట్టుకున్నారు.
ముఖ్య అతిథిగా హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఐసీఏఆర్ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసె ర్చ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్ట ర్ ఎం. శాంత లక్ష్మీ ప్రసాద్, గౌరవ అతిథిగా పాఠశాల వైస్ చైర్మన్ టి. పాండు రం గాచారి హాజరయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్ ప్రీతి బిస్వాల్, వైస్ ప్రిన్సిపాల్ ప్రీతి గిరీష్ అతిథులకు స్వా గతం పలికారు. విద్యార్థుల గీతాలు, సంప్రదాయ స్వాగ త నృత్యంతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోని వివిధ దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి.