ఈవీ కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్!
ముంబై: టాటా మోటార్స్(Tata Motors), భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ, తన ఎలక్ట్రిక్ చిన్న వాణిజ్య వాహనాలు, పికప్‌ల (e-SCVPU) వినియోగదారులకు అనుకూలీకరించిన ఫైనాన్సింగ్ పథకాలను అందించేందుకు, భారతదేశపు తొలి బ్యాటరీ ఇంటెలిజెన్స్, లైఫ్‌సైకిల్ మేనేజ్మెంట్ సంస్థ అయిన ఫిన్జో ఈవీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టర్నో)తో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.
ఈ భాగస్వామ్యం ద్వారా టాటా మోటార్స్ వినియోగదారులు త్వరితగతిన రుణ మంజూరు, సౌకర్యవంతమైన రుణ తిరిగి చెల్లింపు ప్రణాళికలు, వాహన విలువలో 25% హామీతో కూడిన బైబ్యాక్ సదుపాయాన్ని పొందగలుగుతారు. ఈ సందర్భంగా టర్నో డైరెక్టర్ వరుణ్ నాయర్ మాట్లాడుతూ“ఈవీ (EV) యాజమాన్యాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు, వినియోగదారులకు మరింత లాభదాయకంగా మార్చడం ద్వారా భారతదేశవ్యాప్తంగా పర్యావరణహిత, ఉద్గార రహిత రవాణా వైపు మార్పును వేగవంతం చేయడమే టర్నో లక్ష్యం. ఎలక్ట్రిక్ వాణిజ్య రవాణా రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, వినియోగదారులు తమ వాహనాల జీవితకాల విలువపై మరింత స్పష్టత, భరోసాను కోరుకుంటున్నారు.
ఈ అవసరాలను తీర్చడంతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాలకు మారడాన్ని మరింత సులభతరం చేసేందుకు టాటా మోటార్స్‌తో మా భాగస్వామ్యం అనుకూలీకరించిన ఫైనాన్సింగ్ సదుపాయాలు, హామీతో కూడిన బైబ్యాక్ మద్దతును అందిస్తుంది. బ్యాటరీ ఇంటెలిజెన్స్, ఈవీ లైఫ్‌సైకిల్ మేనేజ్మెంట్లో మాకున్న నైపుణ్యాన్ని, హామీతో కూడిన బైబ్యాక్ కార్యక్రమంతో సమన్వయం చేయడం ద్వారా ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల కొనుగోలు, వినియోగం, పునఃవిక్రయ ప్రక్రియల్లో వినియోగదారులకు మరింత భరోసాను కల్పిస్తున్నాము,” అని అన్నారు.
ఈ కార్యక్రమంపై టాటా మోటార్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ & బిజినెస్ హెడ్ పినాకి హల్దార్ వ్యాఖ్యానిస్తూ “స్వచ్ఛమైన రవాణాను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, సుస్థిరమైన చివరి మైలు రవాణా (Last-mile Logistics) దిశగా భారతదేశం సాగిస్తున్న పరివర్తనను వేగవంతం చేయడానికి టాటా మోటార్స్ కట్టుబడి ఉంది. మా ఎలక్ట్రిక్ చిన్న వాణిజ్య వాహనాలు, పికప్‌ల (e-SCVPU) శ్రేణి అత్యుత్తమ పనితీరు, విశ్వసనీయత, తక్కువ నిర్వహణ వ్యయ ప్రయోజనాలను అందించేలా రూపొందించబడింది. అయితే, వాహన యాజమాన్యం మరింత సులభంగా, ముందుగానే అంచనా వేయగలిగేలా, ఎలాంటి ఆందోళనలకు తావులేకుండా ఉన్నప్పుడే వాటి వినియోగం మరింత విస్తరిస్తుంది.
టర్నోతో మా భాగస్వామ్యం వినియోగదారులకు సమగ్ర యాజమాన్య మద్దతును అందించడం ద్వారా మా ఎలక్ట్రిక్ వాహన పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. ఫైనాన్సింగ్‌కు సంబంధించిన అడ్డంకులను తొలగించడంతో పాటు, దీర్ఘకాలిక పునఃవిక్రయ విలువకు భరోసా కల్పించడం ద్వారా దేశవ్యాప్తంగా వినియోగదారులు మరింత విశ్వాసంతో ఉద్గార రహిత రవాణా వైపు మారేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.