భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
- 21 మందికి స్థాన చలనం
- హైదరాబాద్ సీపీగా మహేశ్ భగవత్
- షీటీమ్స్ డీజీగా సౌమ్య మిశ్రా
- వీసీ సజ్జనార్‌కు ఫైర్ డీజీ బాధ్యతలు
- టీమార్స్ డైరెక్టర్‌గా స్టీఫెన్ రవీంద్ర
- సివిల్ సప్లు కమిషనర్‌గా నాగిరెడ్డి
- ఆర్టీసీ ఎండీగా అనిల్‌కుమార్
- లా అండ్ ఆర్డర్ ఏడీజీగా అకున్ సబర్వాల్
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): రాష్ట్ర పోలీస్ శాఖ(Telangana Police Department)లో పెద్దసంఖ్యలో బదిలీలు జరిగాయి. 21 మంది ఐపీఎస్ అధికారులకు ఒకేసారి స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా మహేశ్ మురళీధర్ భగవత్‌ను నియమించింది.
ఇప్పటివరకు ఈ స్థానంలో కొనసాగిన వీసీ సజ్జనార్‌ను ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం డీజీగా బదిలీ చేసింది. జైళ్ల శాఖ డీజీ స్థానం సౌమ్య మిశ్రాను మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా విభాగానికి మార్చింది. అదనంగా డీజీపీ ఆర్గనైజేషన్, డీజీపీ లీగల్ బాధ్యతలను కూడా అప్పగించింది. స్వాతి లక్రాను జైళ్ల శాఖ డీజీగా నియమిస్తూ.. హోంగార్డ్స్ విభాగం డీజీపీ బాధ్యతలను అదనంగా అప్పగించింది.
గేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల డీజీపీ అనిల్ కుమార్‌ను టీజీఎస్‌ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేసింది. ఆయన స్థానంలో విక్రమ్‌సింగ్ మాన్‌ను నియమించింది. నాగిరెడ్డిని సివిల్ సప్లయీస్ శాఖ కమిషనర్‌గా బదిలీ చేసింది. ఆయనకే సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎండీ, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ బాధ్యతలను అదనంగా అప్పగించింది. ఎం. స్టీఫెన్ రవీంద్రను ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్‌గా నియమించింది. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీగా అకున్ సబర్వాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.