కాంగ్రెస్ పార్టీపై బురద చల్లడం మానుకోవాలి

05-11-2026 | 08:25pm

మహాదేవపూర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీపై బురద చల్లడం మానుకోవాలని మహాదేవపూర్ మండల కాంగ్రెస్ నాయకులు పెద్దపల్లి ఎంపీని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇటీవల కొయ్యురులో జరిగిన ఘటనపై మండల కాంగ్రెస్ నాయకులు విలేకరులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మంథని నియోజకవర్గం(Manthani constituency)లో మంత్రి శ్రీధర్ బాబు, శ్రీనుబాబులు మీ గెలుపును వారి బుజాలపై వేసుకొని మిమ్ములను గెలిపిస్తేనే ఎంపి అయినారన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.

మీరు ఎన్ని పార్టీలు మారిన మీకు అవకాశం ఇచ్చి గెలిపించింది కాంగ్రెస్ పార్టీ(Congress Party) అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఓట్లేసి గెలిపిస్తే మిమ్ములను ఓడకోట్టాలని చుసిన బిఆర్ఎస్ నాయకులతో కలిసి పర్యనలు చేస్తున్నారని వారు ఆరోపించారు. కొయ్యురు గ్రామ సర్పంచ్ దళిత మహిళకు మీ పర్యటన సమాచారం తెలువక పోవడం మీకు తగునా అని ప్రశ్నించారు.మంత్రి శ్రీధర్ బాబు మిమ్ములను పక్కకు పెట్టాలని చేస్తే మంథని నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ ఎలా వస్తదో ఎంపి వంశీ  సమాధానం చెప్పాలన్నారు. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పై న కాని మంత్రి శ్రీధర్ బాబు. శ్రీనుబాబు పై బురదచల్లే రాజకీయాలు మానుకొని  ఓట్లేసిన కార్యకర్తలకోసం పనిచేయాలని ఎంపి గడ్డం వంశీ కి మండల కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు లేతకారి రాజబాబు కాళేశ్వరం ఆలయ ధర్మకర్తలు మంచినీళ్ల దుర్గయ్య. ఓడేటి పద్మ, దొడ్ల అశోక్, మహాదేవపూర్ సర్పంచ్ హసీనాబాన్, మైనార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆశ్రర్ ఖురేషి, యూత్ టౌన్ అధ్యక్షులు నయీమ్. మండల నాయకులు బుర్రి శివరాజ్, కోట సమ్మయ్య,చేకూర్తి శంకరయ్య, కడార్ల నాగరాజు, యూత్ నాయకులు కొండగొర్ల సంతోష్, రాఘవేంద్ర, ఐత తిరుపతి రెడ్డి, సురేష్, తుంగల సంతోష్, శంకరయ్య, అహమ్మద్, లింగాల సుందర్, తదితరులు పాల్గోన్నారు.

మరిన్ని వార్తలు