ఆటోకు నిప్పు.. క్షణాల్లో బుగ్గిపాలు!

30-10-2026 | 11:01am

బోధన్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా చందూర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ఆటోకు నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. గురువారం రాత్రి ఇంటి ముందు పార్క్ చేసిన ఆటోకు దుండగులు నిప్పు పెట్టడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది.

రాత్రివేళ ఆటో నుంచి ఒక్కసారిగా మంటలు (Fire Accident) ఎగసిపడటాన్ని గమనించిన స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆటో పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో బాధితుడికి ఆర్థిక నష్టం వాటిల్లింది.

ఆటోకు నిప్పు పెట్టిన వ్యక్తులు ఎవరు? ఈ చర్యకు పాల్పడటానికి గల కారణాలేంటి? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు