గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ప్రమాదం

18-11-2026 | 07:15am

పటాన్ చెరు/ జిన్నారం నవంబర్ 18: సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామిక వాడలో(Gaddapotharam industrial area) ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. వర్ధమాన్ ఇండస్ట్రీస్  కెమికల్ పరిశ్రమలోని సాల్వెంట్ రికవరీ విభాగంలో పేలుడు సంభవించినట్లు సమాచారం. ఒక్కసారిగా భారీ శబ్దంతో బ్లాస్ట్ కావడంతో పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. పేలుడు శబ్దం విన్న సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పారిశ్రామిక ప్రాంతంలో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, ఆస్తి నష్టం, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు