వడ్ల లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం
భూపాలపల్లి టౌన్, నవంబర్ 18 ( విజయ క్రాంతి) : వడ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన బుధవారం తెల్లవారుజామున జయశంకర్ భూపాలపల్లి( Jayashankar Bhupalpally ) జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే కాటారం నుండి హైదరాబాదుకు వడ్ల లోడుతో వెళ్తున్న లారీ స్థానిక 5 ఇంక్లైన్ కమాన్ సమీపంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం(BRS Party District Office) ఎదుట బోల్తా పడింది. ఆ సమయంలో ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఘటనలో డ్రైవర్, క్లీనర్ లకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. లారీ ఆదిలాబాద్ కు చెందినదిగా సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.