22న హైదరాబాద్‌కు కాంగ్రెస్ కొత్త ఇన్చార్జ్ సందీప్
పీఏసీ, పీసీసీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరు
హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్చార్జ్ బీఎం సంతోష్(BM Santhosh) ఈ నెల 22న రాష్ట్రానికి రానున్నారు. ఇప్పటి వరకు ఇన్చార్జ్గా కొనసాగిన మీనాక్షినటరాజన్(Meenakshi Natarajan) స్థానంలో కర్ణాటకకు(Karnataka) చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత బీఎం సందీప్‌ను(Senior Congress leader BM Sandeep) నాలుగు రోజుల క్రితమే పార్టీ అధిష్ఠానం తెలంగాణకు ఇన్చార్జ్గా నియమించిన విషయం తెలిసిందే. 22న ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ(Political Affairs Committee) (పీఏసీ) సమావేశానికి హాజరుకున్నారు.
ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇన్చార్జ్ సందీప్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు సభ్యులు హాజరుకానున్నారు. పార్టీ, ప్రభుత్వానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల పంపకంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మధ్యాహ్నం 3 గంటలకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన పీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి తీసుకునే అంశాలతోపాటు ఇప్పటీ వరకు చేపట్టిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. మరుసటి రోజు కూడా బీఎం సందీప్ హైదరాబాద్‌లో అందుబాటులో ఉండనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, సీనియర్ నాయకులతో కొత్త ఇన్చార్జ్ సందీప్ భేటీ కానున్నారు.