కేంద్ర మంత్రులకు మోదీ క్లాస్

18-11-2026 | 07:34am

కేంద్ర ప్రభుత్వంలో యాక్షన్ ప్లాన్.. మోదీ కీలక భేటీ!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) కేంద్ర మంత్రివర్గంతో బుధవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఫిలిప్పీన్స్ పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన అనంతరం ఈ భేటీ జరగనుంది. దేశ రాజధానిలోని భారత్ మండపంలో ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. గతంలో నిర్దేశించుకున్న లక్ష్యాల పురోగతిని సమీక్షించడంతో పాటు రాబోయే రోజుల్లో ప్రభుత్వ ప్రాధాన్యతలను నిర్ణయించడమే ప్రధాన అజెండాగా కనిపిస్తోంది.

ఈ సమావేశంలో వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు(Union Ministries) ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాల అమలుపై ప్రధాని వివరాలు తెలుసుకోనున్నారు. గత సమావేశంలో అప్పగించిన బాధ్యతలు ఎంతవరకు పూర్తయ్యాయి? ప్రభుత్వ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయి? అనే అంశాలపై సమీక్ష జరగనుంది. అలాగే రాబోయే కాలానికి సంబంధించి కొత్త Action Plan, భవిష్యత్ కార్యాచరణను రూపొందించడంపై చర్చించనున్నారు. సెప్టెంబర్‌లో జరిగిన కేంద్ర మంత్రిమండలి గత సమావేశం ‘చింతన్ శిబిర్’లో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలనే అంశంపై ప్రధానంగా చర్చించారు. 100 Percent Coverage లక్ష్యంగా పథకాల అమలును మరింత మెరుగుపరచడం, ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం వంటి అంశాలపై మంత్రులు అభిప్రాయాలు పంచుకున్నారు. పలు శాఖలు తమ భవిష్యత్ ప్రణాళికలను కూడా వివరించాయి.

2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే Viksit Bharat 2047 లక్ష్యానికి అనుగుణంగా వివిధ మంత్రిత్వ శాఖల ప్రణాళికలు ఈ చర్చల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతంలో విస్తృత స్థాయిలో మంత్రులతో సమావేశాలు నిర్వహించగా, తాజా భేటీలో కేవలం కేబినెట్ మంత్రులకే అవకాశం కల్పించడం విశేషం. ఇటీవల ప్రధాని మోదీ తన కార్యాలయంలో సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు కేబినెట్ మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ స్థాయిల్లో పనితీరు, లక్ష్యాల అమలుపై సమగ్ర సమీక్ష జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.

మరిన్ని వార్తలు