కాంగ్రెస్ ఎమ్మెల్సీ కారుకు ప్రమాదం

18-11-2026 | 08:07am

అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. బల్మూరి వెంకట్ దంపతులకు గాయాలు!

రంగారెడ్డి: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(Telangana MLC Balmoor Venkat ) ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు జంక్షన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఎమ్మెల్సీ కారు ఢీకొట్టినట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రయాణ సమయంలో కొత్తూరు జంక్షన్ వద్ద ముందువైపు వెళ్తున్న కోళ్ల లోడ్ డీసీఎంను బల్మూరి వెంకట్ కారు ఢీకొంది.

దీంతో ఒక్కసారిగా అక్కడ ప్రమాద వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో కారు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం నుంచి బల్మూరి వెంకట్, ఆయన భార్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెద్ద ప్రమాదం తప్పడంతో కుటుంబ సభ్యులు, అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు