ఘోర విమాన ప్రమాదం.. 17 మంది మృతి!
రష్యా: రష్యాలో ఘోర విమాన ప్రమాదం(Military Plane Crash) తీవ్ర విషాదాన్ని నింపింది. సైబీరియాలోని కెమెరోవో ప్రాంతంలో ‘అంటోనోవ్ ఏఎన్-12’ సైనిక రవాణా విమానం(Antonov AN-12 Crash) మంగళవారం ప్రమాదానికి గురై నేలకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న 17 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. యగునోవో గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కెమెరోవో ప్రాంత గవర్నర్ ఇల్యా సెరెడ్యూక్ ఈ ఘటనను ధ్రువీకరించారు. నొవొసిబిర్స్క్ నుంచి క్రాస్నోయార్స్క్‌లోని కాన్స్క్కు విమానం విడిభాగాలను తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో సిబ్బంది Distress Signal పంపించారు. అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించినప్పటికీ ప్రమాదాన్ని తప్పించుకోలేకపోయారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. విమానం నేలకూలడానికి ముందే గాలిలో మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో ఇంధనం లీక్ కావడం వల్ల మంటలు వ్యాపించి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం సహా ఇతర Technical Failures కోణాల్లోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జనావాసాలపై విమానం పడకుండా సిబ్బంది చివరి క్షణం వరకు ప్రయత్నించినట్లు సమాచారం. 1950వ దశకంలో సోవియట్ యూనియన్ రూపొందించిన అంటోనోవ్ ఏఎన్-12 నాలుగు ఇంజిన్ల టర్బోప్రాప్ విమానం. సైనిక, కార్గో రవాణా కోసం వీటిని వినియోగిస్తుంటారు. ఈ ఘోర ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టత రాలేదు. అధికారులు Crash Investigation కొనసాగిస్తున్నారు.