పెద్దంపేటలో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్
మహాదేవపూర్, నవంబర్, 18(విజయక్రాంతి): మహాదేవపూర్(Mahadevpur) మండలం పెద్దంపేట గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ కంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ఎస్పీ శిరి శెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు మహదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లపర్యవేక్షణలో పోలీస్ సమ్యూనిటీ కంటాక్ట్(Police Conduct Community Contact Program) చేపట్టారు.గ్రామంలో విశ్తృత తనిఖీలు చేశారు.తనిఖీలలో నిబంధనలు ఉల్లంఘించిన 17 వాహనాలపై జరిమానాలు విధించారు. అదేవిధంగా ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి అక్రమంగా తయారు చేసిన 7 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా మహదేవపూర్ సి ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.గ్రామ ప్రజలకు పలు సూచనలుచేశారు.
మూఢనమ్మకాలు, చేతబడులు వంటి వాటిని నమ్మి మోసపోవద్దని, వాటి పేరుతో ప్రజలను భయపెట్టే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలనిసూచించారుగుడుంబా తయారీ, విక్రయాలు మరియు వినియోగం చట్టరీత్యా నేరమని, అటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తెలిపారు.గ్రామంలోని ముఖ్యమైన కూడళ్లు, రహదారులు, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.ప్రజల భద్రత, గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎస్సై సాంబమూర్తి తో పాటు సిబ్బంది ప్రజలు పాల్గోన్నారు,