భర్తలు లేకున్నా.. సర్కార్ అండగా ఉంటుంది!
- ఎంపీ బలరాం నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు
- వక్రీకరించారని ఎంపీ వివరణ
నవంబర్ 17 (విజయక్రాంతి): భర్తలు లేకున్నా.. చెల్లెళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, వితంతు పెన్షన్(Widow Pension) ఇస్తుందని మహబూబాబాద్ ఎంపీ బల రాంనాయక్(Mahabubabad MP Balaram Naik) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఎంపీ చేసిన వ్యాఖ్యలు వైరల్(Viral comments) కావడంతో, తాను ఎలాంటి దురుద్దేశంతో వ్యాఖ్యలు చేయలేదని, మారుమూల ఆదివాసి ప్రాంతంలోని(Tribal area) మహిళలను తన సోదరీమణుల్లాగా భావించి, వారి భర్తలు చనిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పథకం(Congress Government's 'Cheyutha' Scheme) ద్వారా పింఛన్ అందించి అండగా నిలుస్తుందని వివరించేందుకే చెప్పానని అన్నారు. తన వ్యాఖ్యలను కావాలని వివాదాస్పదం చేశారని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని, ఒకవేళ ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించాలని ఆయన ఆ తర్వాత వివరణ ఇచ్చారు.