సైన్సులో దాగిన మనసు కవిత్వం

02-11-2026 | 05:05am

విష్ణు సహస్ర నామాల్లో అత్యాధునిక టెక్నాలజీకి చెందిన అనేక విషయాలు దాగి ఉన్నాయని డాక్టర్ రేమెళ్ల అవధానులు(Dr. Remella Avadhanulu) ఒక ముఖా ముఖిలో చెప్పగా విని, మన పూర్వీకుల ముందు చూపు, విజ్ఞాన సంపద గొప్పతనం ఏమిటో తెలిసింది. మనిషి దేనికి భయపడతాడో తెలుసుకున్న పూర్వీకులు అనంత విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని.. నామాలు, మంత్రాలు వగైరా రూపాల్లో నిక్షిప్తం చేసి ఉంచారని మరింత స్పష్టమైనది.

అప్పుడే అనిపించిం ది.. మనం నిజజీవితంలో పాటించే ఎన్నో పద్ధతుల్లో సైన్స్ ఉందని. దానికి తిరుగులేని ఉదాహరణ ఎన్నో యుగాలు, తరాల నుంచి పఠించబడుతున్న ‘పూర్ణమదఃపూర్ణమిదం పూర్ణముదచ్యతే’ అనే శ్లోకం. సైన్సు ప్లస్ ఆధ్యాత్మిక = బ్రహ్మము అని మన పూర్వీకులు అంటే, సైన్సు + మనసు =జీరో గ్రావిటీ అంటున్నారు కవి, ఫిజిక్స్ అరుణ్‌కుమార్.

వృత్తిరీత్యా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడైన అరుణ్‌కుమార్ కంటికి కనపడని, అనుభూతిని మాత్రమే పంచే మనసును తన వృత్తిపరమైన భౌతిక శాస్త్రానికి జోడిం చి కవిత్వం రాయడం ఆయన శైలి. వృత్తికి ప్రవృత్తిని ఎంతగా అనుసంధానించారంటే జీరో గ్రావిటీ అనే ఈ కవితా సంపుటిని.. మేధో సంపత్తులై ఆధ్యాత్మిక మార్గంలో నడిచిన స్వామి వివేకానందకు, శ్రీనివాస రా మానుజన్‌కు అంకితం ఇచ్చారు. 

అరుణ్ కవిత్వం చాలా రోజుల నుంచి గమనిస్తున్నా. వాస్తవానికి ఇతని కవిత్వం ఏ ఒక్క ఇజానికి కట్టుబడి కాకుండా మొత్తం సమాజాన్ని తన కవిత్వంతో తరచితరచి చూ స్తోంది. ఇతని కవిత్వంలో యుద్ధం, అంతరిక్ష యానం, బంధాలు, ఆకలికేకలు, ప్రేమలు, అనుబంధాలు, రక్తసంబంధాలు, మానవ సంబంధాలు..

ఇలా ప్రతి వస్తువు ఫిజిక్స్ పరిభాషా రూపకాల్లో, విశేషణాల్లో, ఉపమానాల్లో మునిగి తేలి పాఠకుల మనసును చేరుతుంది. నాన్నపై ఎన్నో కవితలు చదివాను. కానీ, గణితం ఈక్వేషన్స్(23 పేజీ)తో, ఫిజిక్స్ కొలమానాల్లో, సూత్రాల్లో కొత్తగా కనిపిస్తారు నాన్న. అలాగే ‘ఆమె బతికే ఉంటుంది’ కవితలో చనిపోయిన డాక్టర్ చేసిన అవయవ దానంతో ఆమె బతికే ఉంటుంది (34 పేజీ) అంటాడు కవి అరుణ్. 

బాల్యపు ఆవేదన నుంచి ఆత్మవిశ్వాసం దాకా..   

మధ్యాహ్నపు మండుటెండల్లో.. ఆధునిక రహదారుల వెంట.. బాల్యపు ఆవేదన బారాన్ని మోసుకుంటూ.. ఆకలి సంగీతాన్ని ఆస్వాదిస్తున్న అనాథ పిల్లల కడుపుమంటల్లో పోరాటకవిత్వం ఉందంటూ ‘కన్నీటి శిఖరాలకు’(36పేజీ) సరికొత్త నిర్వచనం అద్దారు కవి అరుణ్. మనసులో నిరాశ, నిస్పృ హలు ఉన్నప్పుపడు వాటిని తుడిచివేసి, కొత్త ఆశలను చిగురింపజేసే కవితలు ఇందులో కనిపిస్తాయి.

‘అంతరిక్ష చెరసాలలో భారరహితమై.. సాంకేతిక వైఫల్యాల గాఢాంధకారంలో ఆమె బంధీ అయింది. ఆత్మవిశ్వాసపు తారల పూదోట విచ్చుకుంటే.. నవమాసాల నాటకీయ పరిణామాల అలలన్నీ ఆవిరై.. అంతరిక్షమే ఆమె ముందు తెలిపోయిం ది’ అంటూ ‘సునీత ఏ స్పేస్ వార్’ (38వ పేజీ)లో సునీతా విలియమ్స్ అం తరిక్ష యాత్రకు బయలుదేరింది మొదలుకొని,  తిరిగి భూమిపై కాలు మోపే వరకు ఎదుర్కొన్న సవాళ్లు, సాంకేతిక వైఫల్యాలను అద్భుతంగా అక్షరీకరించారు.   

తొమ్మిది నెలల అంధకార గర్భం నుంచి బయటపడిన శిశువులా, పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడిలా బయట పడినప్పుడు అంతరిక్షమే ఆమె ధైర్యం ముందు మోకరిల్లినట్లు ప్రతిబింబించే ఈ వాక్యాలు.. అరుణ్ ఆలోచనా విధానానికి అద్దం పడతాయి. ఇటువంటి విజయగాథలు తెలిపే కొన్ని కవితలు మనలో కూడా స్ఫూర్తిని నింపుతాయి. ‘సూర్యుడు లేని ఉదయం’(44 పేజీ) అబ్దుల్ కలాం గారిని ఉదయించిన సూర్యుడిలా చేస్తే, డాకింగ్ (47 పేజీ) ప్రతి పౌరుడిని ఇస్రో సంస్థల విజయపుదారిలో బాటసారిని చేస్తోంది.

సైన్స్ సూత్రాలతో సామాజిక చైతన్యం

‘పిడికెడు ఆత్మగౌరవం కోసం’(66 పేజీ) నిలబడిన కలేకూరి గారిని, ‘కవిత్వమై కనిపిస్తున్న’(90 పేజీ) కాళోజీ నారాయణరావు గారిని మనం అరు ణ్ కవితల్లో దర్శించవచ్చు. మరెన్నో స్మృతి కవితలు, విజయగాథలు సైన్స్ పదబంధాలతో ముడిపడి మనల్ని సరికొత్త లోకానికి తీసుకెళ్తాయి. యుద్ధం అంటే ప్రతి ఒక్కరికీ నచ్చని విషయమే.

అందుకే ఆధిపత్యం, అహంకారం చావని దేశాలు చేస్తున్న యుద్ధాలను ఖండిస్తూ శాంతిని కాంక్షించే ఉషోదయాలకు ఊపిరి పోద్దాం అంటున్నారు.. కవి అరుణ్. ప్రేమలు, బంధాలు, అలకలు ఇలా ఎన్నింటినో వస్తువులుగా తీసుకుని సైన్స్ సూత్రాలతో అల్లిన అరుణ్ కవితలు.. పాఠకులను ఓ వింత అనుభూతికి లోను చేస్తాయి.

ఇలా ‘జీరో గ్రావిటీ’గా తెరుచుకున్న ఈ కణం.. 124 కవితా కణాలుగా విభజింపబడింది. ఒక్కో కవితాకణం మనల్ని కవి ఆత్మ చుట్టూ తిరిగేలా చేస్తుంది. అయితే, అక్కడక్కడ ఉపయోగించిన పదబంధాలు అచ్చంగా సైన్స్ పరిభాషకు చెందినవి కావడంతో, నాలాంటి సైన్సేతర పాఠకులకు వాటి అర్థం అం తుబట్టదు. వాటిని అర్థకం చేసుకునేందుకకు పదో తరగతి వరకు సైన్స్ పుస్తకాలను మరోసారి తిరగేయాల్సిందే. 

సాధ్యమైనంత సరళమైన భాష, అందరికీ అర్థమయ్యే పదాలు, రూపకాలు, విశేషణాలు, అ లంకారాలతో అల్లబడి కవితాపంక్తులై ఉండడం వల్ల అరుణ్ కవిత్వం ఎక్కువ శాతం పాఠకులను చేరుతుంది. ఇప్పటికే ఎందరో ప్రశంసలను అం దుకున్న అరుణ్, మున్ముందు మరిన్ని సాహితా పురస్కారాలు, ప్రశంసలు పొందాలని ఆకాంక్షిస్తూ.. అభినందనలు తెలియజేస్తున్నాం.

కవితాసంపుటి కోసం, సంప్రదించాల్సిన చిరునామా

పుస్తకం పేరు: జీరో గ్రావిటీ కవిత్వం, 

పేజీలు :134, ప్రచురణలు :జేఎస్ పబ్లికేషన్స్,

వెల: రూ.180, సెల్ నంబర్:9394749536, రాధాకృష్ణ్ణ కర్రి, 9951916499


మరిన్ని వార్తలు