రోడ్ల ‘స్వీపింగ్’కి లీజుల బ్రేక్!
- సీఎంసీ సాహసోపేత నిర్ణయం
- రూ. 3.85 కోట్లతో 7 స్వీపింగ్ యంత్రాల కొనుగోలుకు శ్రీకారం
- ప్రజాధనం వృథాకు అడ్డుకట్ట వేసేలా టెండర్ల ఆహ్వానం
- మూడేళ్ల పాటు తయారీ సంస్థకే నిర్వహణ బాధ్యతలు
- జీహెచ్ఎంసీ, ఎంఎంసీల్లోనూ మొదలైన ఆలోచన
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1(విజయక్రాంతి): గ్రేటర్ పరిధిలో ప్రధాన రహదారుల శుభ్రత కోసం ఏళ్ల తరబడి కొనసాగుతున్న ‘స్వీపింగ్ మెషిన్ల లీజు’(Leasing of sweeping machines) విధానం లో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్న విమర్శలకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(Cyberabad Municipal Corporation) (సీఎంసీ) చెక్ పెట్టింది.
ప్రైవేటు ఏజెన్సీలకు కోట్ల రూపాయలు దోచిపెట్టే లీజు పద్ధతికి స్వస్తి పలికి, సొంతంగానే యం త్రాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. స్వచ్ఛ భారత్ (అర్బన్) 2.0 మిషన్ కింద మంజూరైన రూ.3.85 కోట్ల నిధులతో ఏడు స్వీపింగ్ మెషిన్లను సమకూర్చుకునేందుకు సీఎంసీ అధికారులు టెండర్లు ఆహ్వానించారు.
కొనుగోలు చేసిన యంత్రాల నిర్వహ ణ (మెయింటెనెన్స్) బాధ్యతలను కూడా మూడేళ్ల పాటు తయారీ సంస్థకే అప్పగించేలా పక్కా నిబంధనలు పొందుపరిచారు. సీఎంసీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) వ్యాప్తంగా ఆసక్తికర చర్చ కు దారితీసింది.
కోట్లలో నిధుల ఆదా....
మున్సిపల్ కార్పొరేషన్లలో రోడ్ల స్వీపింగ్ పేరుతో ఏటా రూ.కోట్లు ప్రైవేట్ కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి చేరుతున్నాయి. లీజు విధానం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని... సొంత కొనుగోలు వల్ల జరిగే క్యూర్, జిహెచ్ఎంసికి ఆదాయం ఆదా అవుతుందని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
జీహెచ్ఎంసీ, సీఎంసీ పరిధిలో ఒక్కో స్వీ పింగ్ మెషిన్‌కు ఇంధనం, డ్రైవర్, నిర్వహణ పేరుతో నెలకు రూ.5 లక్షల నుంచి రూ.6.5 లక్షల వరకు కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారు. ఒక్కో యంత్రానికి ఏటా రూ.60 లక్షల నుం చి రూ.75 లక్షల ప్రజాధనం ఖర్చవుతోంది. 10 మెషిన్ల లీజుకే ఏటా దాదాపు రూ.6 కోట్ల నుంచి రూ.7.5 కోట్లు మున్సిపాలిటీలు వెచ్చిస్తున్నాయి.
సొంత కొనుగోలుతో రూ.కోట్ల ఆదా
సీఎంసీ ప్రతిపాదన ప్రకారం రూ.3.85 కోట్లతో 7 యంత్రాలు కొనుగోలు చేస్తున్నా రు. అంటే ఒక్కో యంత్రం కొనుగోలు ధర దాదాపు రూ.55 లక్షలు. ఒక్క ఏడాది లీజు ఖర్చుతోనే యంత్రం మున్సిపాలిటీకి సొంతమవుతుంది. మొదటి ఏడాదిలోనే మెషిన్ ధర రికవర్ అవ్వడమే కాకుండా, 3 ఏళ్ల నిర్వహణ ఒప్పందం వల్ల కార్పొరేషన్‌కు ప్రతి ఏటా రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ప్రజాధనం మిగులుతుంది.
కాంట్రాక్టర్ల ‘తూతూమంత్రం’.. నిధుల స్వీపింగ్
రోడ్లను శుభ్రం చేయడం పక్కన పెట్టి, జిపిఎస్ ట్రాకింగ్‌లు, ట్రిప్పుల లెక్కల్లో హెచ్చుతగ్గులు చూపుతూ ప్రైవేటు ఏజెన్సీలు నిధులను ‘స్వీప్’ చేస్తున్నాయనే విమర్శలు ఉన్నా యి. లీజు యంత్రాలు సరిగ్గా తిరగకపోవడం, రాత్రి వేళల్లో తూతూమంత్రంగా ప నులు కానిచ్చేయడంతో ప్రజాధనం నీళ్లపాలవుతోంది. సీఎంసీ నిర్ణయంతో ఈ అ క్రమాలకు అడ్డుకట్ట పడనుంది.
అధికారుల అంతర్మథనం.... అందరూ ఓకే చెప్తారా?....
యంత్రాలను సొంతంగా కొనుగోలు చేస్తే డ్రైవర్లు, సాంకేతిక సిబ్బంది నియామకం,పర్యవేక్షణ బాధ్యత కార్పొరేష్ప పడు తుందని కొందరు అధికారులు సాకులు చూ పే అవకాశం లేకపోలేదు. మరోవైపు, ఏటా క్రమం తప్పకుండా వచ్చే లీజు టెండర్లలో ల బ్ధి పొందే విభాగాల నుంచి కొంత అంతర్గత ప్రతిఘటన ఎదురైనా.. సీఎంసీ పక్కా నిబంధనలతో ముందుకెళ్తోంది. మూడేళ్ల నిర్వహ ణను తయారీ సంస్థలకే అప్పగించడం వల్ల సిబ్బంది, విడిభాగాల సమస్య తలెత్తకుండా చెక్ పెట్టింది.
జీహెచ్ఎంసీ, ఎంఎంసీలూ అడుగులు వేయాలి.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చూపిన ఈ బాటను జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. లీజు విధానానికి స్వస్తి పలికి సొంత కొనుగోలు మోడల్‌ను అమలు చేస్తే ఏటా వందలాది కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా... పారదర్శకమైన టెండర్ విధానంతో నగర రోడ్లు క్లీన్‌గా మారడమే కాకుండా మున్సిపల్ ఖజానాపై తీవ్ర భారం తగ్గుతుంది.