ప్రజా వ్యతిరేకతకు ఓటమి తప్పదు!

08-11-2026 | 05:10am

డాక్టర్ తిరునహరి శేషు :

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు(Presidential Elections) జరిగిన రెండేండ్ల తర్వాత ప్రతినిధుల సభకు, సెనేట్‌లోని మూడో వంతు స్థానాలకు మధ్యంతర ఎన్నికలు జరుగుతా యి. నవంబర్ 3న జరిగిన ఈ మధ్యంతర ఎన్నికల్లో(Midterm election) ఊహించినట్లుగానే డెమోక్రాట్లు తమ ఎన్నికల చిహ్నమైన గాడిదపై ఊరేగు తూ నీలి విప్లవం సృష్టించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రతినిధుల సభలోనూ, సెనేట్‌లోనూ డెమోక్రాట్లు మెజార్టీ(Democrats in the majority) సాధించారు. డెమోక్రాట్ల విజయా న్ని అడ్డుకోవటానికి సర్వశక్తులొడ్డిన డొనా ల్డ్ ట్రంప్(Donald Trump) ఓటమి చెందక తప్పలేదు.

గత రెండేండ్లుగా ట్రంప్ నిర్ణయాలతో విసుగుచెందిన అమెరికా ప్రజలు రిపబ్లిక్లను టెక్సాస్, కాన్సస్, సౌత్ కరోలినా, జార్జియా లాంటి రాష్ట్రాల్లోనే కాదు.. ట్రంప్‌కు గట్టి మద్దతుదారుడైన వహయో రాష్ట్ర గవర్నర్‌గా పోటీ చేసిన వివేక్ రామస్వామిని కూడా ఓడించారు. వివాదస్పదమైన నిర్ణయాలు, యుద్ధాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థని సంక్షోభంలోకి నెట్టటం, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌తో సుంకాల విధింపు, దేశంలో జీవన వ్యయం పెరగటం, ద్రవ్యోల్బణం లాంటి అంశాలు ట్రంప్ ఓటమికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.

ట్రంప్ ఏకపక్ష నిర్ణయాల నుంచి అమెరికాను కాపాడుకోవడానికి మధ్యంతర ఎన్నికల్లో అమెరికా కాంగ్రెస్ (ప్రతినిధుల సభ+ సెనేట్) ద్వారా ట్రంప్‌ను కట్టడి చేయాలని ఆ దేశ ప్రజలు భారీ మెజార్టీలతో డెమోక్రాట్లని గెలిపించినట్లుగా ఫలితాల సరళి స్పష్టం చేస్తున్నది. అధ్యక్ష ఎన్నికల్లో హిస్పానిక్స్ మరియు నల్ల జాతీయుల మద్దతు తోనే ట్రంప్ గెలిచారు, కానీ మధ్యంతర ఎన్నికల్లో వారి మద్దతుతోనే డెమోక్రాట్లు విజయం సాధించారు.

ఈ ఎన్నికలకు ముందు నేను ఓడిపోతే ‘మిస్టర్ వీటో’గా మారుతానని బీరాలు పలికిన ట్రంప్ డెమోక్రాట్ల విజయం తరువాత వారితో కలిసి పని చేస్తానని చెబుతున్నారు. ప్రతినిధుల సభలో, సెనేట్‌లో డెమోక్రాట్లు మెజార్టీ సాధించటం, కీలక రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికలలో కూడా డెమోక్రాట్లు విజ యం సాధించటంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పుంజుకోవటం బ్యారెల్ క్రూడాయిల్ ధర 94 డాలర్లకు తగ్గటం చూస్తుంటే ఆ దేశ ప్రజలే కాదు.. ప్రపంచమంతా ట్రంప్ ఓడిపోవాలని కోరుకున్న ట్లుగా కనపడుతున్నది.

ప్రజా వ్యతిరేక నిర్ణయాలు..

మధ్యంతర ఎన్నికలకు ముందే ట్రంప్, రిపబ్లికన్ల ఓటమి ఖరారైపోయింది. జార్జియాలో కమ్యూనిస్టులను గెలవనివ్వను అనే ట్రంప్ శపథం కూడా నెరవేరకపోగా మొట్టమొదటి నల్లజాతి వ్యక్తి కిషలాన్స్ బాటమ్ ఆ రాష్ట్ర గవర్నర్‌గా గెలుపొందారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలు అతని పాలనకు రెఫరెండంగానే భావించాలి. 2025 నవంబర్‌లో జరిగిన న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో కూడా ట్రంప్ అభిష్టానికి వ్యతిరేకంగా న్యూయార్క్ ప్రజలు జోరాన్ మాందానీని గెలిపించి ట్రంప్ పాలన పట్ల ప్రజలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు.

మాగా, అమెరికా ఫస్ట్ లాంటి నినాదాలతో యుద్ధాలకు వ్యతిరేకమని ప్రచారం చేసుకొని అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ రెండేండ్లుగా తాను తీసుకుంటున్న నిర్ణయాలు, ఇరాన్‌తో యుద్ధం, అమెరికా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసిన నేపథ్యంలో ట్రంప్‌కు వ్యతిరేకంగా నో కింగ్స్ అంటూ ప్రజలు నిరసన ప్రదర్శనలు చేసినా ట్రంప్ తన వైఖరిని మార్చుకోకపోవటంతో మధ్యంతర ఎన్నికలలో అమెరికన్లు ట్రంప్ ను ఓడించి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు ఓటమి తప్పదని నిరూపించారు. 

సుప్రీం తప్పుబట్టినా..

సుంకాల విషయంలో అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ నిర్ణయాలను తప్పు పట్టింది. అదేవిధంగా 60 రోజుల తర్వాత ఇరాన్‌పై యుద్ధం కొనసాగించాలంటే అమెరికా కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి అవుతుంది. కానీ ట్రంప్ ఇప్పటివరకు ఇరాన్‌పై యుద్ధాన్ని కొనసాగించటానికి కాంగ్రెస్ అనుమతి తీసుకోలేదు. 61 శాతం అమెరికన్లు ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారని అసోసియేట్ ప్రెస్ సర్వే చెబుతోంది.

మధ్యంతర ఎన్నికల్లో ఓటమిపై ట్రంప్ స్పందిస్తూ బ్యాలెట్ లో ‘నా పేరు ఉంటే ఓడిపోయేవారమే కాదు’ అని చెబుతూనే వీటో పేరుతో ఎర్ర టోపీని తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. తరువాత ప్రజాతీర్పుకు తలవంచి డెమోక్రాట్లతో కలిసి పని చేస్తానని చెబుతు న్నారు. ఇరాన్‌పై యుద్ధమే మధ్యంతర ఎన్నికల్లో మమ్మల్ని ఓడించిందని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ చెబుతు న్నారు. కానీ ఒక్క ఇరాన్‌పై యుద్ధమే కాదు ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలు, అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినటం కూడా ట్రంప్ ఓటమికి కారణమయ్యాయి.

 ఆంతరంగిక విషయాలలో జోక్యం

ట్రంప్ రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దేశాల ఆంత రంగిక విషయాలలో జోక్యం చేసుకోవటమే కాదు.. యుద్ధాలకు వ్యతిరేకమని, ఎనిమిది దేశాలలో యుద్ధాలను ఆపానని నోబెల్ శాంతి బహుమతికి తానే అర్హుడనని చెప్పే ట్రంప్ గాజాలో ఇజ్రాయెల్ చేసి న నరమేధానికి మద్దతు తెలపటమేకాదు.. ఇజ్రాయెల్ తరఫున వకాల్తా పుచ్చుకొని అణ్వాయుధాల తయారీని బూచీగా చూపించి ఇరాన్‌పై సంయుక్తంగా యుద్ధానికి తెగబడ్డారు.

వెనిజువెలా అధ్యక్షుడైన మధురోని చెరబట్టటం, బ్రెజిల్ ఎన్నికలలో జోక్యం చేసుకొని డాసిల్వా చేతిలో ఓడిపోవడం, బెంజిమన్ నెతన్యాహును గెలిపించుకోలేకపోవడం, కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా చేరాలని ఒత్తిడి చేయ డం, మెక్సికో ప్రధాని క్లాడియా షీన్‌బాంబ్ ని టారిఫ్‌ల విషయంలో, వలసల విషయంలో ఇబ్బంది పెట్టటం, గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవటానికి డెన్మార్క్‌పై ఒత్తిడి చేయడం, వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్‌ను లొంగ తీసుకోవాలనే ప్రయత్నాలు ట్రంప్ నియంతృత్వానికి పరాకాష్ట. ఈ విధానాలు సగటు అమెరికన్‌కు ఆమోద యోగ్యంగా లేకపోవడంతో ట్రంప్‌ను కట్టడి చేయటానికి మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లను అమెరికా ప్రజలు దారుణంగా ఓడించారు.

నియంతృత్వాన్ని సహించరు..!

ఇరాన్‌తో యుద్ధం, ట్రంప్ నియంతృ త్వ పోకడలు, ఏకపక్ష నిర్ణయాలు మద్యంతర ఎన్నికలలో రిపబ్లికన్లను దెబ్బతీశాయి. ప్రజాస్వామ్యంలో పాలకులు.. ప్రజల అభీష్టం మేరకే నిర్ణయాలు తీసుకోవాలి, పాలనా సాగించాలి. ఏకపక్ష నిర్ణయాలను, నియంతృత్వ పోకడలను ప్రజలు ఏమా త్రం సహించరనేది ట్రంప్ ఓటమితో స్పష్టమవుతున్నది. భారత్‌లో కూడా ప్రశ్నాప త్రాల లీకేజీకి వ్యతిరేకంగా, పరీక్షలలో సంస్కరణల కోసం ఉద్యమించిన యువతపై ప్రభుత్వాలు అణిచివేతకు, నిర్బంధా లకు పాల్పడ్డాయి. ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడు తున్న విపక్ష పార్టీలపై నిర్బంధం, యువతను జైళ్లకు పంపించటాన్ని కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం, స్టేట్ ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు, తెలంగాణలో కూడా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిత్యం గత ప్రభుత్వా న్ని విమర్శిస్తూ కాలం వెళ్లదీస్తున్న వైనాన్ని కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాబ ట్టి ఎంతటి బలమైన పార్టీ అయినా! నేత అయినా! ప్రజాతీర్పుకు తలవంచాల్సిందే. ప్రజావ్యతిరేక నిర్ణయాలకు మూల్యం చెల్లించాల్సిందే.. అది ట్రంప్ అయినా! మోదీ అయినా! రేవంత్ అయినా! ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణీతలు ప్రజలే.

 వ్యాసకర్త : అసిస్టెంట్ ప్రొఫెసర్

9885465877

మరిన్ని వార్తలు