భరతజాతి భవిష్యవాణి

26-11-2026 | 05:05am

ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్:

నేడు ‘రాజ్యాంగ దినోత్సవం’ 

భారత రాజ్యాంగం(Constitution of India) ఒక పుస్తకం కాదు. ఒక జాతి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే మహత్తర శక్తి. అది కేవ లం పాలనా వ్యవస్థకు సంబంధించిన చట్టాల సమాహారం(Collection of Laws) కాదు. వేల యేండ్లుగా సామాజిక అసమానతలు(Social inequalities), కుల, మత, ప్రాంతీయ వివక్షలతో విడిపోయిన భారతీయులందరినీ సమాన పౌరులుగా నిలబె ట్టిన ప్రజాస్వామ్య ప్రతిజ్ఞ. రాజుల పాలనకు చరమగీతం పాడి, ప్రజలే పాలకుల ను ఎన్నుకునే హక్కును సాధించుకున్న చారిత్రక సందర్భం.

అంతటి మహత్తర రాజ్యాంగాన్ని మనకు మనమే అంకితం చేసుకున్న నవంబర్ 26ను కేవలం ఒక వేడుకగా కాకుండా, ప్రతి భారతీయుడి జీవితంలో ఒక నిరంతర స్ఫూర్తిగా మలుచుకోవాల్సిన అవసరముంది. ఆరు దశా బ్దాలకుపైగా అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదు. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వం 2015లో నవంబర్ 26ను రా జ్యాంగ దినోత్సవం(సంవిధాన్ దివస్)గా జరపాలని నిర్ణయించింది.

దీంతో రాజ్యాం గ ఆమోదదినానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. భారత రాజ్యాంగ సభ 1946 డిసెం బర్ 9న తొలిసారి సమావేశమైంది. స్వా తంత్య్ర సమరయోధులు, న్యాయ నిపుణులు, మేధావులు, వివిధ రంగాల ప్రము ఖులతో కూడిన రాజ్యాంగ సభ దాదాపు 2 సంవత్సరాల 11 నెలల పాటు సుదీర్ఘ చర్చలు జరిపింది. అనేక అంశాలపై లోతై న చర్చలు, సంప్రదింపు అనంతరం 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1950 జనవరి 26 నుంచి రాజ్యాం గం అమల్లోకొచ్చింది. ఆ రోజు  ఏటా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం.

రెండు తేదీలూ చారిత్రకమే!

రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ 26కు, అమల్లోకి వచ్చిన జనవరి 26కు ప్రత్యేక చారిత్రక ప్రాధాన్యం ఉంది. గతం లో రాజ్యాంగ దినోత్సవానికి ప్రాధాన్యం లభించకపోయినా, 2015 నుంచి నిర్వహిస్తున్నాం. కానీ, దాని అసలు ఉద్దేశం, ప్రా ముఖ్యత ఇంకా ప్రజల ఆలోచనా విధానంలో అంతర్లీనం కాలేదు. నవంబర్ 26 ప్రతి భారతీయుడి హృదయంలో నిలిచిపోవాలి. మన రాజ్యాంగం కేవలం ఒక గ్రంథం కాదు. అది ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు, ఆశయాలకు, భవిష్యత్తు కలలకు ప్రతిబింబం. వేల ఏండ్ల చరిత్ర కలిగిన ఈ భారత భూమిపై పాలన రాజ్యాంగబద్ధం గా సాగాలన్న సంకల్పానికి అది ప్రతిరూపం.

కులం, మతం, భాష, ప్రాంతం, లిం గం వంటి విభేదాలతో సమాజం చీలిపోయి, అసమానతల అగాధాల్లో కొట్టుమి ట్టాడిన పరిస్థితుల్లో భారతీయులందరికీ సమాన హక్కులు కల్పించిన ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగం పునా ది వేసింది.  సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే ఆధునిక ప్రజాస్వామ్య విలు వలను ప్రతిష్ఠించింది. కుల, మత, లింగ వివక్షలనధిగమించి, భారతీయులందరూ సమాన హక్కులు కలిగిన పౌరులనే గొప్ప భావనను ఆవిష్కరించింది. ఈ ఆధునిక ప్రజాస్వామ్య విలువలు మన దేశానికి మనం ఇచ్చుకున్న గొప్ప కానుక.  

మరుగున పడుతున్న స్ఫూర్తి

 రాజుల వ్యవస్థకు స్వస్తి పలికి, రాజ్యాధికారం ప్రజల అభీష్టం మేరకు ఎన్నికల ద్వారా మారాలన్న ప్రజాస్వామ్య సూత్రా న్ని మనం రాజ్యాంగం ద్వారా అంగీకరిం చాం.  కానీ.. నేడు జరుగుతున్నదేమిటి? రాజ్యాంగం స్ఫూర్తి అనేక సందర్భాల్లో మరుగునపడుతున్నది. రాజ్యాంగంలోని అంశాలు న్యాయస్థానాల్లో వాదోపవాదాలకే పరిమితమైపోతున్నాయన్న అభిప్రా యాలున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ నిబంధనలను తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారనే విమర్శలున్నాయి.

రాజ్యాంగ సంస్థల స్వతంత్రత, వాటి పనితీరు, జవాబుదారీతనం గురించి ప్రజల్లో ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే విషయంలో జరుగుతున్న జాప్యం కూడా రాజ్యాంగ వ్యవస్థల పనితీరుపై చర్చకు దారితీసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణలు, వెలువడిన అభిప్రాయాలు సమాఖ్య వ్యవస్థ లోని అధికారాల పరిధి, రాజ్యాంగబద్ధ బాధ్యతలు, నిర్ణయాల కాలపరిమితి వంటి అంశాలపై తీవ్ర చర్చను రేకెత్తించాయి. 

మీడియా కూడా భాగమే..

సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, ప్రజా సమస్యలను ఎలుగెత్తి చూపాల్సిన ప్రధాన మీడియా సంస్థలు కూడా తమ బాధ్యతను గుర్తించాలి. వ్యాపార ప్రయోజనాలు, రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా ప్రజల పక్షాన నిలబడినప్పుడే పత్రికా స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభంగా తన పాత్రను సమర్థంగా నిర్వహించాలి. పాలకులను ప్రశ్నిం చడం, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, రాజ్యాంగ విలువలను కాపాడటంలో మీడియా పాత్ర కీలకం. 

ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు అయి న ఎన్నికల ప్రక్రియ కూడా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఎన్నికల్లో ధన ప్రవా హం, కుల, మత ప్రాతిపదికన ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయి.  ప్రజాస్వామ్యంలో రాజకీయ నేత ల బాధ్యత ఎంత ముఖ్యమో, పౌరుల బా ధ్యతా అంతే ముఖ్యం. ఎన్నికల్లో సరైన అభ్యర్థులను ఎన్నుకోవడం, ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవడం, ప్రభుత్వాలను ప్రశ్నించడం, ప్రజా సమస్యలపై స్పందించడం పౌరుల ప్రాథమిక బాధ్యతలు. రాజ్యాంగం పట్ల మనకున్న బాధ్యతను గుర్తించి, ఆచరణలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.  

పుస్తకం కాదు, మార్గదర్శి

రాజ్యాంగం అనేది హక్కులను కల్పించే పుస్తకం మాత్రమే కాదు. పౌరులుగా మ నం నిర్వర్తించాల్సిన ప్రాథమిక బాధ్యతలను గుర్తుచేసే మార్గదర్శి కూడా. అందుకే రాజ్యాంగంపై సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించాలి. ఆ అవగాహనతోనే పౌరులు తమ హక్కులను కాపాడుకోగలరు. తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలరు. పాలకుల పనితీరును రాజ్యాంగ ప్రమాణాల ఆధారంగా అంచనా వేయగలరు. రాజ్యాంగ దినోత్సవం కేవలం నవంబర్ 26న పాఠశాలల్లో ప్రమాణాలు, సభలు, ఉపన్యాసా లతో ముగిసిపోకూడదు.

రాజ్యాంగంలోని ప్రధాన అంశాలపై విద్యార్థులకు చిన్నత నం నుంచే అవగాహన కల్పించాలి. పాఠశాల విద్యతోపాటు కళాశాలలు, విశ్వవిద్యా లయాల్లోనూ రాజ్యాంగ విద్యకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. అన్ని కోర్సుల్లో విద్యార్థుల స్థాయికి అనుగుణంగా రాజ్యాంగ సంబంధిత అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చాలి. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, విద్యార్థులకు అర్థమయ్యేలా బోధిం చేలా చర్యలు చేపట్టాలి.మన రాజ్యాంగం యావత్ జాతిని ఒకే తాటిపైకి తీసుకువచ్చే ఐక్యతా రాగం కావాలి.

కుల, మత, భాష, ప్రాంతీయ భేదాలకు అతీతంగా భారతీయులందరినీ సమానపౌరులుగా నిలబెట్టే శక్తి రాజ్యాంగానికి ఉంది. ఆ శక్తిని గుర్తించి, దాని విలువలను మన జీవితాల్లో ఆచరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. దేశా న్ని అభివృద్ధి పథంలో నడిపించే ఆయు ధం రాజ్యాంగమే అన్న సత్యాన్ని ప్రతి పౌరుడు గుర్తించాలి. రాజ్యాంగ దినోత్సవం అంటే గత చరిత్రను గుర్తుచేసుకోవడమే కాదు. వర్తమానంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థను సమీక్షించుకోవడం, భవిష్యత్తులో మరింత సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి సంకల్పం తీసుకోవడం కూడా. రాజ్యాంగం పట్ల గౌరవం మాటల్లో కాదు, ఆచరణలో కనిపించాలి.  పాలకులు, పౌరులు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలి.

 వ్యాసకర్త : కేయూ జర్నలిజం        

విభాగాధిపతి, సెల్- :9866255355

మరిన్ని వార్తలు