వ్యవ‘సాయానికి’ కరువెందుకు?
రైతు(Farmer) దేశానికి వెన్నెముక. మనం తినే ప్రతీ మెతుకు వెనుక రైతన్నల నిరంతర శ్రమ, చెమట, త్యాగం దాగున్నాయి. ఎండా, వాన, చలి అనే తేడా లేకుండా ప్రకృతితో పోరాడుతూ సమా జం మొత్తానికి అన్నం పెట్టేది అన్నదాతలే. భూమిని నమ్ముకుని, ఓర్పుతో కష్టపడి ప్రజల ఆకలి తీర్చడం వారి గొప్పతనం. రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది.
రైతు కన్నీరు పెట్టుకుంటే ఆ రాజ్యం మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. ‘ఎద్దు ఏడ్చిన ఎవుసం నిలవదు.. రైతు ఏడ్చిన రాజ్యం నడవదు!’ అని పెద్ద లు ఏనాడో చెప్పిన మాట అక్షర సత్యం. అయితే, తెలంగాణలో గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత ప్రభుత్వ పాలనకు మధ్య వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న మార్పులను పరిశీలిస్తే వ్యవ‘సాయం’ మళ్లీ గత గాయాలలోకి వెళ్తున్నదేమో అనే సం దేహాలు కలుగుతున్నట్లు స్పష్టమవుతున్నది.
‘తెలంగాణ’కు ముందు తర్వాత!
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదికల ప్రకారం తెలంగాణలో 2014లో 898 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, 2015లో ఈ సంఖ్య 1,358కు చేరింది. అనంతర కాలంలో ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది. 2023 నాటికి రాష్ట్రంలో రైతులు/సాగుదారుల ఆత్మహత్యల సంఖ్య 56కు తగ్గింది. 2015తో పోలిస్తే ఇది సుమారు 95.8 శాతం తగ్గుదల. ఈ గణాంకాలు మన వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న మార్పులను ప్రతిబింబిస్తున్నాయి. రైతుబంధు, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటి పథకాలు రైతులకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పించాయని బీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి..
అప్పట్లో కరెంట్ కష్టాలెన్నో..?
2014కు పూర్వం రాష్ట్రంలో విద్యుత్ కోతలు, లో-వోల్టేజీ సమస్యలు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవి. బోరు మోటార్లు నడవక, పంటలు ఎండిపోతూ నష్టాలను చవిచూశారు. విద్యుత్ సమస్యలపై సబ్‌స్టేషన్ల వద్ద ధర్నాలు, రాస్తారోకోలు నిత్యకృ త్యంగా మారిన పరిస్థితులు ఉండేవి. ప్రత్యే క రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిస్థితులు చాలావరకు మారిపోయాయి. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంట ల ఉచిత విద్యుత్ సరఫరా చేసింది. బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులకు ఇది ఎంతో ఉపయోగకరమైన నిర్ణయంగా నిలిచింది. సాగుకు అవసరమైన సమయంలో విద్యుత్ అందుబా టులో ఉండటం రైతుల్లో కొంత భరోసా ను కల్పించింది.
రైతుకు భరోసాగా..
ఇకపోతే.. పంటలు వేయాలంటే పెట్టుబడి కావాలి. విత్తనాలు, ఎరువులు, పురు గుమందులు, కూలీల ఖర్చులకు డబ్బులు కావాలి. అందుకోసం రైతు బ్యాంకులు, లేదా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు లు చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. కానీ, కేసీఆర్ ప్రభుత్వం కర్షకులకు వెన్నుదన్నుగా నిలవాలనే సంకల్పంతో రైతుబం ధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎకరాకు ప్రతి సీజన్‌కు రూ.5,000 చొప్పున, యేటా రెండు పంటలకు కలిపి రూ.10,000 పెట్టుబడి సాయంగా అందించింది.
ఈ పథకం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పథకం అమలు చేయాలంటూ అక్కడి రైతుల్లో డిమాండ్ వెల్లువెత్తింది. అంతేకాదు, రైతులకే కాదు.. వారి కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో రైతుబీమా పథకానికి బీఆర్‌ఎస్ సర్కార్ శ్రీకారం చుట్టింది. అనుకోని పరిస్థితుల్లో రైతు మరణిస్తే అతని కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందేలా ప్రభుత్వం రైతు కుటుంబాలకు అడుగడుగునా అండగా నిలిచింది. ఇవే కాకుండా పంట రుణమాఫీ, వ్యవసాయ పనిముట్ల పంపిణీ, గోదాముల నిర్మాణం, వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం వంటి కార్యక్రమాల ద్వారా వ్యవసాయరంగానికి సంపూర్ణ మద్దతు కల్పించే ప్రయత్నాలు జరిగాయి.
గోదావరిలో ప్ర‘జల’ కష్టాలు!
పెట్టుబడికి ధనం ఎంతముఖ్యమో, పం టల సాగుకు నీరు కూడా అంతే ముఖ్యం. 2014కు ముందు రాష్ట్రంలో సాగునీటికే కాదు, తాగునీటికీ కొరతే ఉండేది. వర్షాలు సమయానికి పడకపోతే, భూగర్భ జలాలు అడుగంటిపోతే రైతు పరిస్థితి దయనీయంగా ఉండేది. అయితే, రాష్ట్ర ప్ర‘జల’ కష్టాలు తీరేందుకు రాష్ట్రం గుండా పారే గోదా వరి జలాలే ప్రధాన వనరు. రాష్ట్రం లో కరువు మాట వినపడకూడదనే ఉద్దేశంతో శాశ్వత సాగునీటి వనరులు అవస రమనే ఆలోచనతో గోదావరి జలాలను వినియోగించుకోవడానికి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించింది.
కలిసిరాని కాలం!
అయితే, కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు, నిర్వహణ, బ్యారేజీల భద్రత వంటి అంశాలపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తాయి. ఈ అంశాలపై సమగ్ర సాంకేతిక పరిశీలన, బాధ్యతాయుతమైన చర్యలు అవసరం. రాజకీయ విభేదాలకు అతీతం గా ప్రజాధనంతో నిర్మించిన సాగునీటి వ్యవస్థను రైతుల ప్రయోజనాల కోసం సమర్థంగా వినియోగించుకోవడం ప్రభు త్వ బాధ్యత. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు అందుతున్న పథకాల అమలు, విద్యుత్ సరఫరా, సాగునీటి లభ్య త, పంట పెట్టుబడి సాయం వంటి అంశాలపై రైతుల్లో చర్చ జరుగుతోంది.
రైతుబం ధు స్థానంలో రైతుభరోసా అమలు, రైతుబీమా కొనసాగింపు, పంట రుణమాఫీ, 24 గంటల విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ప్రభుత్వం తన విధానాలను స్పష్టంగా వివరించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి, రైతుకు ఇచ్చే హామీలు కేవలం ప్రక టనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా లేదా అనేది పరిశీలించాలి. విద్యుత్ సరఫరా సక్రమంగా ఉందా? సాగునీరు అందుబాటులో ఉం దా? పెట్టుబడి సాయం సకాలంలో అం దుతోందా? పంటలకు గిట్టుబాటు ధర లభిస్తోందా? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
దీనికి తోడు ఎల్నినో ప్రభావం, వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు వ్యవసాయ రంగానికి సవాళ్లుగా మారే అవకాశం ఉంది. ఇలాం టి పరిస్థితుల్లో రైతులకు ముందస్తు సూచనలు ఇవ్వడం, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడం, సాగునీటి వనరులను సమర్థంగా వినియోగించడం అత్యం త అవసరం. ఇలాంటి క్లిష్ట సమయంలో కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకే పరిమితం కాకుండా, వాటి సాంకేతిక సమస్యలను పరిష్కరించి రైతులకు ఉపయోగపడేలా చేయాలి.
రైతు ప్రయోజనాలే ముఖ్యం!
గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూ రైతు బంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు వంటి పథకాలను అమ లు చేసింది. ఈ పథకాల ప్రభావం, వాటి లోపాలు, ఆర్థిక భారం, దీర్ఘకాలిక ప్రయోజనాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమం విషయంలో గత ప్రభుత్వ పథకాలలోని ఉపయోగకరమైన అంశాలను కొనసాగిస్తూ, అవసరమైన మార్పులు చేసి మరింత మెరుగైన విధానాలను అమ లు చేయాలి. రైతుకు భరోసా ఇవ్వడం అంటే కేవలం హామీలు ఇవ్వడం కాదు. సమయానికి విద్యుత్ అందించడం, సాగునీరు కల్పించడం, పెట్టుబడి సాయం అందించడం, పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, అప్పుల భారాన్ని తగ్గించడం, పంట నష్టపోయినప్పుడు పరిహారం అందించడం.
కోటి రతనాల వీణగా తెలంగాణను అభివర్ణించిన దాశరథి కృష్ణమాచార్యుల స్ఫూర్తితో, తెలంగాణను వ్యవసాయపరంగా సుసంపన్నం చేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై సమీక్ష జరగాలి. అదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం కూడా రైతు సంక్షేమాన్ని తన పాలనలో అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలి. రైతు బాగుంటేనే రాజ్యం బాగుం టుంది. రైతు బతికితేనే వ్యవసాయం బతుకుతుంది. వ్యవసాయం బతికితేనే సమా జం బతుకుతుంది. దేశానికి అన్నం పెట్టే అన్నదాత అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యే శరణ్యమనే పరిస్థితికి చేరుకోకుండా చూడటం ప్రతి ప్రభుత్వ బాధ్యత.
రైతు సమస్యలపై రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్ర తినిధులు, మేధావులు స్పందించాలి. రైతు సమస్యల పరిష్కారానికి అనుభవజ్ఞులైన నాయకుల సూచనలు, సలహా లు తీసుకోవాలి. వ్యవసాయ రంగానికి ఒక సమగ్ర దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలి. ఇది రైతు కన్నీటి కథగా మిగిలి పోకూడదు. తెలంగాణ రైతు విజయగాథగా మారాలి. వారి కళ్లలో ఆనందం కనిపించినప్పుడే నిజమైన ప్రజాపాలనకు అర్థం.
ఫణిరాజారావు రామినేని