యాసంగిలో వరి సాగు వద్దు
ఎల్నినో ప్రభావం దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ముందుకు రావాలి
జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్
మహబూబాబాద్: ఎల్నినో ప్రభావంతో(impact of El Niño) రానున్న యాసంగి సీజన్లో వర్షపాతం(Rainfall) తగ్గి, నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలను సాగు చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(Mahabubabad District Collector Sneha Sabarish) రైతులకు సూచించారు.ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ అధికారి స్వర్ణ విజయ్ చంద్ర నిర్వహణలో ఎఫ్ పీ వో, పీ ఏ సీ ఎస్, ఆత్మ ఛైర్మన్ లకు వివిధ శాఖల అధికారాలుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులకు ఎల్నినో ప్రభావం, నీటి కొరత పరిస్థితులు, యాసంగి పంటల ప్రణాళికపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, తక్కువ నీరు మరియు తక్కువ పెట్టుబడితో సాగు చేయగల పెసర, మినుము, శనగ, కంది, జొన్న, మొక్కజొన్న తదితర ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు.ప్రస్తుతం ఎల్నినో ప్రభావం వలన
రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకుంటూ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించి ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా స్థిరమైన ఆదాయం పొందాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
చేరువులలో నీరు త్రాగు నీటి కోసం ఉంచాలని వ్యవసాయం కోసం నీటి విడుదల చేయకుండా చూడాలని ఇరిగేషన్ ఎస్ ఈ ని ఆదేశించారు.