ప్రతి పేద కుటుంబానికి రూ. 5లక్షల బీమా

18-11-2026 | 12:18am

హనుమకొండ (విజయక్రాంతి): ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లబ్ధిదారుల నమోదు కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు, బీమా పథకంపై ప్రజలకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్(Collector Chahat Bajpai) ఆదేశించారు.

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఈ నెల 19నుండి  ప్రారంభమవుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, నాయబ్ తహసీల్దార్లు, ఇతర అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో లబ్ధిదారుల నమోదు కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక శిబిరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు.

గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో నిర్వహించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై నిర్వహించే ప్రత్యేక శిబిరాలు, అధికారులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు, ఇతర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్  శేషాద్రి, డీఆర్డీవో మేన శ్రీను, సీపీవో సత్యనారాయణ రెడ్డి, కాజీపేట డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, ఈడీఎం శ్రీధర్, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు,  ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు