శివంపేట మండలంలో పింఛన్ల పండుగ..

18-11-2026 | 12:07am

718 మందికి చేయూత!

ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ

శివంపేట నవంబర్ 17 (విజయక్రాంతి): మండలంలోని నిరుపేదలకు ప్రభుత్వం తీపికబురు అందించింది. కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ఊరట కల్పిస్తూ శివంపేట మండలంలోని 37 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 718 కొత్త చేయూత పింఛన్లు మంజూరైనట్లు ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ(MPDO Venkata Lakshmamma) తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ కొత్త పింఛన్లు మంజూరు చేసిందన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు అర్హులైన లబ్ధిదారులకు ఈ పింఛన్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పింఛన్ల మంజూరుతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు కొంతమేర ఆర్థిక భరోసా లభించనుందని తెలిపారు. 718 మంది లబ్ధిదారులకు చేయూత అందించడం సంతోషకరమని ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ వెల్లడించారు.

మరిన్ని వార్తలు