ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

18-11-2026 | 12:15am

డీసీసీ అధ్యక్షుడు మహ్మద్​ అయూబ్

వరంగల్ (విజయక్రాంతి): వరంగల్ నగరంలో పలు ఆటో యూనియన్లకు చెందిన ముఖ్య నాయకులు మంగళవారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహ్మద్​ అయూబ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆటో కార్మికులు(Auto Workers) ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో  ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు నష్టపోయామని ప్రభుత్వం దృష్టికి తేవడంతో స్పందించిన సిఎం రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గొప్ప మనసుతో ఆలోచించి ఇందిరమ్మ టవర్ నిర్మాణం చేసి 75 శాతం సబ్సిడి ఇస్తున్నారో అదే తరహాలోనే వరంగల్ నగరంలోని అర్హులైన ఆటో కార్మికులకు ఇవ్వాలని కోరారు. అలాగే ఇతర సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం తరఫున తగిన చర్యలు తీసుకునేలా కృషి చేయాలని కోరారు. ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు