పంటలపై వ్యవసాయ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
18-11-2026 | 12:13am
ఎర్రుపాలెం నవంబర్ 17 (విజయక్రాంతి): మండల పరిధిలోని బనిగండ్లపాడు గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి నాగినేని నాగసాయి(Agricultural Extension Officer Nagineni Nagasai) ఆధ్వర్యంలో మధిర వ్యవసాయ పరిశోధన స్థానం వ్యవసాయ డిప్లమా రెండవ సంవత్సరం విద్యార్థులు వరి, పత్తి, మిరప పంటల సాగు వివరాలు, సాగుకు అయ్యే ఖర్చు వివరాలను విద్యార్థులకు అభ్యుదయ రైతు శీలం అక్కిరెడ్డి వివరించారు. అదేవిధంగా గ్రామంలోని సహకార సంఘంలో రైతులు పొందే సేవలు, సొసైటీ వారు అందించే వివిధ రుణాలు, ఎరువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం సిబ్బంది అరుణ, సుకన్య మరియు హరీష్ పాల్గొన్నారు.