గవర్నర్‌కు ఆహ్వానం

18-11-2026 | 12:20am

గవర్నర్‌కు ఆహ్వాన పత్రిక అందజేసిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు

జగిత్యాల, నవంబర్ 17 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న 60 ఏళ్లకోసారి జరిగే చందనోత్సవం, మహాసంప్రోక్షణ, నిజరూప దర్శన మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా(Governor Shiv Pratap Shukla)ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రెవెన్యూ, దేవాదాయ శాఖల ప్రధాన కార్యదర్శి  శైలజా రామయ్యర్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌  ఎం. హనుమంతరావు తదితరులు మంగళవారం లోక్‌భవన్‌లో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కొండగట్టు క్షేత్ర పురాణం, ఆలయ ఆవిర్భావం, స్థలపురాణం, ఆధ్యాత్మిక విశిష్టత, చారిత్రక ప్రాశస్త్యాన్ని గవర్నర్‌కు వారు వివరించారు. 60 ఏళ్లకోసారి నిర్వహించే ఈ విశిష్ట ఆధ్యాత్మిక ఉత్సవాల ప్రాధాన్యతను తెలియజేస్తూ, మహోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా గవర్నర్‌ను ఆహ్వానించారు.

మరిన్ని వార్తలు