స్వెటర్స్ విక్రయ కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే
హనుమకొండ, నవంబర్ 12 (విజయ క్రాంతి):హనుమకొండ అశోక జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన నేపాల్, టిబెట్‌కు చెందిన స్వెటర్ విక్రయ కేంద్రాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ జీవనోపాధి కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్న.
నేపాల్, టిబెట్ ప్రాంతాల వారికి మనమంతా అండగా నిలవాలని అన్నారు. ప్రతి సంవత్సరం వారు ఇక్కడికి వచ్చి స్వెటర్ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు.మన సమాజంలో భాగమై, మనతో కలిసిమెలిసి జీవిస్తున్నారని, వారి జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.
స్థానికులుగా వారికి ప్రోత్సాహం అందించడం మనందరి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే వెంట టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక డివిజన్ అధ్యక్షులు శ్యామ్, తాడిచెట్టి విద్యాసాగర్, నలుబోల సతీష్, కట్ల శ్రీను, తోట రాజకుమార్, బియబాని, కల్లూరి పవన్ తదితరులు ఉన్నారు.