2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

16-11-2026 | 12:26pm

జగిత్యాల,(విజయక్రాంతి): జగిత్యాల పట్టణం 2వ వార్డుకు చెందిన రామగిరి మమత మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతూ, చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతుండగా స్థానిక కౌన్సిలర్ దయాల చంద్రకళ శంకర్(Councilor Dayala Chandrakala Shankar) జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్(Jagtial MLA Dr. Sanjay Kumar) దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే  మమతకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి(NIMS Hospital)లో మెదడు సంబంధిత చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.2,50,000 విలువైన ఎల్‌ఓసీని మంజూరు చేయించారు.

ఈరోజు జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగిరి మమత కుటుంబ సభ్యులకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  అందజేశారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు దయాల శంకర్, సర్పంచులు ఆకుల మల్లేశం, నక్క హరీష్, ఆకుల తిరుపతి, రాజన్న గౌడ్, తోట లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు