భూపాలపల్లిని కరువు జిల్లాగా ప్రకటించాలి

10-11-2026 | 04:39pm

సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా

భూపాలపల్లి, నవంబర్ 10 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాను(Jayashankar Bhupalpally District) సంపూర్ణ కరువు జిల్లాగా ప్రకటించి రైతులను(Farmers') ఆదుకోవాలని సీపీఐ(CPI) డిమాండ్ చేసింది. మంగళవారం కలెక్టరేట్ ఎదుట పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లాలోని 12 మండలాల్లో కరువు పరిస్థితులు(Drought conditions) ఉన్నప్పటికీ కేవలం ఐదు మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించడం అన్యాయమని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఫైండ్ల శాంతికుమార్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మామిడాల సమ్మిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు సోతుకు ప్రవీణ్‌కుమార్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గుంటి చంద్రమౌళి అన్నారు.

పంట నష్టపోయిన వరి రైతులకు ఎకరాకు రూ.30 వేలు, వాణిజ్య పంటలకు రూ.50 వేలు, వరి సాగు(Paddy cultivation) చేయని రైతులకు రూ.10 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు కుడుదుల వెంకటేష్, క్యాతరాజ్ సతీష్, అన్నారపు రాజేందర్, పెంట రవి, ఎండి నబి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు