ఇసుక లారీ ఢీకొని బైకర్ మృతి
03-11-2026 | 04:53pm
భూపాలపల్లి /మహాదేవపూర్ నవంబర్ 3 విజయ క్రాంతి: మహాదేవ్ పూర్ మండలంలోని బీరసాగర్ ఇసుక క్వారీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం(Horrific road accident) జరిగింది. ఇసుక లోడ్ చేసుకున్న లారీ రోడ్డుపైకి వస్తుండగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రమాద తీవ్రతకు మృతుడి ముఖం గుర్తుపట్టలేని విధంగా మారింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.