బాలల దినోత్సవ ప్రత్యేక గ్రామసభ
మహదేవ్పూర్,(విజయక్రాంతి): మహదేవ్పూర్ గ్రామపంచాయతీ(Mahadevpur Gram Panchayat) ఆవరణలో సర్పంచ్ హసీనా బాను అధ్యక్షతన బాలల దినోత్సవ ప్రత్యేక గ్రామసభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ హసీనా బాను(Sarpanch Haseena Banu) పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు(Children's Day Celebrates) తెలియజేస్తూ, వారి విద్యాభివృద్ధి, క్రమశిక్షణ, ఆరోగ్యం మరియు ఉజ్వల భవిష్యత్తు గురించి వివరించారు.
పిల్లలే దేశ భవిష్యత్తు అని, ప్రతి చిన్నారి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించాలని, తద్వారా సమాజానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.ఈ సందర్బంగా ఉపాధ్యాయులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీజా సంతోష్, పంచాయతీ కార్యదర్శి కల్పన, పాలకవర్గ సభ్యులు గడ్డం స్వామి, నల్లబూగ సమయ్య, చీర్ల వంచ చంద్రశేకర్, మహమ్మద్ బిన్ అలీ, పడాల మొగిలి, కొండపల్లి రాములు తదితరులతో పాటు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.