రావణ దహన వేడుకల్లో పాల్గొన్న దుద్దిళ్ల శ్రీను బాబు
ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మంథని, మహాదేవపూర్, అక్టోబర్ 20(విజయక్రాంతి) : మంథని నియోజకవర్గంలోని(Manthani Constituency) జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల(Mahadevpur Mandal) కేంద్రంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో(Ravana Dahan event) టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు(Duddilla Srinu Babu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ విజయదశమి(Vijayadashami) శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ.. కులమతాలు, పేదధనిక తేడాలు లేకుండా ప్రజలంతా ఒకే వేదికపై కలిసి పండుగలను జరుపుకోవడం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం బలపడినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, ప్రతి ఒక్కరూ సత్యం, ధర్మం, న్యాయం మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. ప్రజలంతా ఐకమత్యంతో సుఖసంతోషాలతో జీవించాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని కోరుకున్నారు.
మహాదేవపూర్‌లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రావణ దహన వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. వేడుకల్లో తనకు ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని దుద్దిళ్ల శ్రీను బాబు ఆకాంక్షించారు.