గణపురంలో యూత్ కాంగ్రెస్ సమావేశం
గణపురం, నవంబర్ 29 (విజయ క్రాంతి): ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao), జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బండ శ్రీకాంత్ పాణి(Banda Srikanth Pani) ఆదేశాలతో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి సమావేశం(Youth Congress Constituency-Level Meeting) గణపురం మండల కేంద్రంలో నిర్వహించారు. మండల అధ్యక్షులు పెండ్యాల వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి నియోజకవర్గ అధ్యక్షులు రజనీకాంత్ గౌడ్ హాజరయ్యారు. యూత్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం, గ్రామ, మండల స్థాయిలో నూతన కమిటీల ఏర్పాటు, యువత భాగస్వామ్యం పెంపుపై చర్చించారు. కార్యక్రమంలో సమీర్, జానీ, పాషా, ఆసిఫ్, రాజేష్, శివ, అజేయ, అంజి, సిద్ధూ, చరణ్, వినీత్, హర్ష తదితరులు పాల్గొన్నారు.