అక్రమ ఇసుక డంపులపై చర్యలు
26-11-2026 | 05:05am
తుమ్మలపల్లిలో 7 ట్రాక్టర్ల ఇసుక స్వాధీనం
అలంపూర్, నవంబర్ 25: రాజోలి మండలంలోని(Rajoli Mandal) తుమ్మలపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులపై(Sand dumps) అధికారులు చర్యలు చేపట్టారు. ఇసుక నిల్వలపై(sand stocks) విచారణకు డిమాండ్ అనే కథనాన్ని మంగళవారం విజయక్రాంతి పత్రిక వెలుగులోకి తీసుకురాగా.. స్పందించిన అధికారులు బుధవారం రంగంలోకి దిగారు. ఎస్ఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బందితో(Revenue Staff) కలిసి తనిఖీలు నిర్వహించి, సుమారు 7 ట్రాక్టర్ల మేర ఉన్న అక్రమ ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం ఇసుకను రెవెన్యూ శాఖకు అప్పగించినట్లు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు