బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత
దోమకొండ, నవంబర్ 14 (విజయక్రాంతి): బాలల దినోత్సవాన్ని(Childrens Day) పురస్కరించుకుని శనివారం అంచనూర్ గ్రామ పంచాయతీ(Anchanur Grama Panchayat) ఆధ్వర్యంలో సర్పంచ్ జనగామ నరేష్(Sarpanch Jangama Naresh) అధ్యక్షతన ప్రత్యేక బాలల గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణలో(Protection of Children's Rights) సమాజ బాధ్యత, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం ప్రాధాన్యతపై విస్తృతంగా చర్చించారు. ప్రతి చిన్నారిని బడికి పంపి బాల కార్మిక రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని వక్తలు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ కందుకూరి ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి భానుశ్రీ, వార్డు సభ్యులు నీరడి రాజశేఖర్, జనగామ నవీన్, పడుగంటి రవి, నగారపు పద్మ, గుడిభాగాని నర్సవ్వ, హెచ్ఎం సంధ్యారాణి, అంగన్వాడీ టీచర్లు సిద్ధమ్మ, గంగమణి, ఆరోగ్య సిబ్బంది హేమలత, బాలమణి, మహిళా సంఘం సీఏలు స్వాతి, శశిరేఖ, గ్రామ పెద్దలు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.