బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలి

14-11-2026 | 04:37pm

బీర్కూర్ సర్పంచ్ అరిగే ధర్మతేజ

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy district) బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండల కేంద్రంలో శనివారం సర్పంచ్ అరిగే ధర్మతేజ(Sarpanch Arige Dharmateja) ఆధ్వర్యంలో బాలల గ్రామసభ(Children's Gramsabha) నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమం, గ్రామాభివృద్ధిలో బాలల భాగస్వామ్యంపై ప్రత్యేకంగా చర్చించారు.గ్రామసభ ఎజెండాలో భాగంగా సర్పంచ్ అరిగే ధర్మతేజ, గ్రామ కార్యదర్శి గంగారాం మాట్లాడుతూ... బాల్య వివాహాల నిర్మూలన, పోషకాహారం ప్రాముఖ్యత, బాలలపై హింస నివారణ, బాలల పరిరక్షణ చట్టాలు, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై వివరించారు.

బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.అనంతరం బాలలకు సంబంధించిన సమస్యలు గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి పలు అంశాలను నమోదు చేసుకున్నారు. బాలల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అవసరమైన అభివృద్ధి పనులను గ్రామపంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ బండి విజయ్, ఉపసర్పంచ్ పరమేష్ పంతులు, వార్డు సభ్యులు భాస్కర్, షేక్ నవాజ్ ఖాన్, నర్సోజీ, మధు, హైమద్, మాజీ సర్పంచ్ సానేపు గంగారాం, మాజీ ఎంపీపీ రఘు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు రఫీ, సత్యకిరణ్, విట్టల్, శశికాంత్, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు