ఫిల్మ్ చాంబర్‌కు గిరిబాబు పార్థివ దేహం
హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు గిరిబాబు(Actor Giribabu) సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్(Secunderabad KIMS Hospital)లో తుదిశ్వాస విడిచారు. అక్కడి నుంచి ఆయన పార్దివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్‌నగర్ ఫిల్మ్ చాంబర్(Film Chamber)కు ఈ రోజు సాయంత్రం తరలించనున్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉంచుతారు. అనంతరం స్వగ్రామానికి తరలించనున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1946లో ప్రకాశం జిల్లాలోని కొరిశపాడు రావినూతల గ్రామంలో 1946 జూన్ 8న జన్మించిన గిరిబాబు.. 1973లో విడుదలైన ‘జగమే మాయ’ సినిమాతో నటుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో దాదాపు 600కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలందించారు.