దేశానికి జవహర్ లాల్ నెహ్రూ చేసిన సేవలు ఎనలేనివి

14-11-2026 | 04:44pm

డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్

మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ(Former Prime Minister Jawaharlal Nehru) దేశానికి చేసిన సేవలు ఎనలేనివని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్(Sanjeev Mudiraj) అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జవహర్ లాల్ నెహ్రూ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి డీసీసీ అధ్యక్షులు, ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్బంగా డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ దేశ స్వాతంత్ర పోరాటంలో(Freedom Struggle) కీలకపాత్ర పోషించారని, అనంతరం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు దూరదృష్టితో ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు.

పారిశ్రామిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశ అభివృద్ధికి బలమైన పునాదులు వేశారని కొనియాడారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమానత్వం, జాతీయ సమైక్యత వంటి విలువలకు నెహ్రూ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, ఆశయ ఆశయాలు నేటికి దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. మహానీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రజా సేవలో ముందుండాలని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదే విధంగా మాజీ ఎంపీ విఠల్ రావు జయంతి నిర్వహించారు.

ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, డీసీసీ ఉపాధ్యక్షులు బెక్కరి మధుసూదన్ రెడ్డి, మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహర్, డిసిసి ప్రధాన కార్యదర్శులు రాములు యాదవ్, సాయిబాబా, ఎంఏ. కలీం, నాయకులు అజ్మత్అలీ, అవేజ్, ఫక్రు, గులాం జహీర్, తాహేర్, నర్సింహారెడ్డి, అక్బర్, గంగిరెడ్డి, అబ్రార్ హుస్సేన్, చందు యాదవ్, తిరుపతినాయక్, రాంచంద్రయ్య, అలీం, హకీమ్, మజర్ ఖాన్, నసీరుద్దీన్, నర్సింహ, జగదీష్, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు