గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
- ఘనంగా 59వ గ్రంథాలయ వారోత్సవాలు
- జిల్లా చైర్మన్ భానోత్ రవిచందర్
ములుగు, నవంబర్ 14 (విజయక్రాంతి) : గ్రంధాలయాలను(Libraries) సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచంద్ర(Library Organization Chairman Banothu Ravichandra) పిలుపునిచ్చారు. శనివారం నుండి 7 రోజుల పాటు జరిగే గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమాన్ని ములుగు జిల్లా(Mulugu District) కేంద్ర గ్రంథాలయ కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన నవంబర్ 14 జాతీయ పిల్లల దినోత్సవ(National Childrens Day) శుభాకాంక్షలు తెలిపారు.
గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జిల్లా గ్రంథాలయ కేంద్రంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గతంలో జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో సరియైన సదుపాలు లేక పాఠకులు ఇబ్బందులు పడేవారని మంత్రి సీతక్క సహకారంతో గ్రంథాలయ కేంద్రంలో నూతన భవనాన్ని నిర్మించామన్నారు.
గ్రంథాలయాల్లో చదువుకునే వారు కస్ట పడి చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి కుటుంబానికి బాసటగా నిలవాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చింతనిప్పుల బిక్షపతి, ములుగు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఆసియా రియాజ్ మీర్జా, ఆత్మ కమిటీ జిల్లా డైరెక్టర్ జక్కుల రేవంత్ యాదవ్, మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎండీ కుతుబుద్ధిన్, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, తదితరులు పాల్గొన్నారు.