గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి...

07-10-2026 | 06:16pm

తాడ్వాయి (విజయక్రాంతి): గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని సిడిపిఓ సుజాత(CDPO Sujatha) తెలిపారు. కామారెడ్డి జిల్లా మండల కేంద్రంలో బుధవారం పోషణ మాసం సందర్భంగా ఘనంగా పోషణ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గర్భిణీలు, బాలింతలు కిశోర బాలికలు తీసుకోవాల్సిన పోషకాహారంపై సమగ్రంగా వివరించారు. అంగన్ వాడీ కేంద్రాల్లో బాలికలకు, గర్భిణీలకు, బాలింతలకు ప్రత్యేకంగా ప్రభుత్వం పోషకాలను అందిస్తుందని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గర్భిణీలు బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె వివరించారు. అంతకుముందు గర్భిణీలకు సీమంతాలు అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భరత్ కుమార్, ఆరోగ్య సిబ్బంది, అంగన్ వాడి సూపర్వైజర్లు, టీచర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు