అందుబాటు ధరల్లో నాణ్యమైన బియ్యం
ఆసిఫాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని(Rice) అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని(Rice Sales Center) జిల్లా పౌర సరఫరాల అధికారి వాజిత్ అలీ మంగళవారం ఆసిఫాబాద్లో(Asifabad) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీపీటీ, కేఎన్ఎం రకం బియ్యం కిలో రూ.66, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా రూ.74, హెచ్ఎంటీ, జేఎస్ఆర్ రకం బియ్యం రూ.79 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు.
వినియోగదారులు తమకు నచ్చిన రకాన్ని ఎంపిక చేసుకోవచ్చన్నారు. మరో వారం రోజుల్లో కాగజ్నగర్లోనూ విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ డీటీలు, కిరాణా దుకాణాల అసోసియేషన్ ప్రతినిధులు, వ్యాపారులు పాల్గొన్నారు.