వరి విత్తనోత్పత్తిపై క్షేత్ర దినోత్సవం
దామరచర్ల నవంబర్ 10: కృషి విజ్ఞాన కేంద్రం, కంపాసాగర్ ఆధ్వర్యంలో దామరచర్ల మండలం(Damaracherla Mandal)లోని బొల్లిగుట్టలో కే ఎన్.ఎం 1638 వరి రకంలో నాణ్యమైన విత్తనోత్పత్తిపై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు మాట్లాడుతూ, రైతులు నాణ్యమైన వరి విత్తనాలను ఉత్పత్తి చేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించడంతో పాటు గ్రామస్థాయిలో నాణ్యమైన విత్తనాల లభ్యతను పెంపొందించవచ్చని తెలిపారు.
కే ఎన్ ఎం1638 వరి రకంలో విత్తనోత్పత్తి చేపట్టేటప్పుడు పాటించాల్సిన సాగు యాజమాన్య పద్ధతులు, విత్తన శుద్ధి, సరైన దూరంలో నాటడం, సమతుల్య ఎరువుల, నీటి యాజమాన్యం, చీడపీడలు తెగుళ్ల నివారణ చర్యలను వివరించారు. విత్తనోత్పత్తి పొలంలో ఇతర రకాల మొక్కలను, కల్తీ మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించడం(Rouging), రకాల స్వచ్ఛతను కాపాడటం, సరైన సమయంలో కోత కోయడం, నూర్పిడి, విత్తనాలను తగిన విధంగా ఆరబెట్టడం, నిల్వ చేసుకోవడం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.