పంటలెండుతున్ను.. కరెంట్ ఇయ్యండి!

06-10-2026 | 05:20am
  1. లో వోల్టేజీతో మోటార్లు కాలుతున్నై
  2. విద్యుత్ కోతలపై భగ్గుమన్న రైతన్న
  3. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు

గంభీరావుపేట/కామారెడ్డి/నిర్మల్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): విద్యుత్ కోతలతో(Power cuts) సాగునీరు(Irrigation water) అందక పంటలు ఎండిపోతున్నాయని, కోతలు లేకుండా కరెంట్ ఇవ్వాలని కోరుతూ సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు(Farmers) ఆందోళనకు దిగారు. రా జన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండ లం రాజేశ్వరరావు కాలనీ వద్ద కామారెడ్డి(Kamareddy) ప్రధాన రహదారిపై గజ సింగవరం, గోరంటాల, సముద్రాళింగాపూర్, మల్లుపల్లె గ్రామాలకు చెందిన రైతులు రోడ్డుపై బైఠాయించారు. వరి పంట పొట్ట దశలో ఉన్న దని లో వోల్టేజీ సమస్యతో మోటార్లు కాలిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాణ్యమైన కరెంటు ఇవ్వక ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని వాపోయారకు. సకాలంలో విద్యుత్ అధికారులు స్పందించక పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డా రు. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదని ఆగ్రహించారు. పోలీసులు, విద్యుత్ అధికారులు చేరుకొని రైతులతో మాట్లాడారు. రైతులకు సరిపడా నాణ్యమైన విద్యుత్ అందిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాలు విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో మల్లు పల్లె సర్పంచ్ సత్యం, రాజేశ్వరరావు కాలనీ సర్పంచ్ పిట్ల బాబునాయకులు రాజిరెడ్డి కొమిరిశెట్టి లక్ష్మణ్ భాస్కర్ నర్సింలు అంజిరెడ్డి రాజారాం రమేష్ ఎల్లం ఆయా గ్రామా ల రైతులు ఉన్నారు.

నిర్మల్ కలెక్టరేట్ వద్ద...

స్వర్ణ ప్రాజెక్టులో నీళ్లు ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంతో తమ పంటలు ఎండిపోతున్నాయని నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని బోరిగాం గ్రామ రైతు లు సోమవారం కలెక్టర్ కార్యాలయం ముం దు ధర్నా నిర్వహించారు. నీళ్లు విడుదల చేయాలని రాష్ట్ర రాష్ట్ర మంత్రులకు వినతి పత్రం అందించడానికి వచ్చిన రైతులను పో లీసులు అడ్డుకోవడంతో వారు అక్కడే రోడ్డు పై కూర్చొని ధర్నా చేశారు. దీంతో కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామ చెరువు కింద సుమారు 700 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు.

ప్రస్తుతం వర్షాలు లేక చెరువులో నీరు లేకపోవడంతో పంటలకు సాగునీటి కొ రత ఏర్పడిందన్నారు. ముఖ్యంగా వరి పంట పొట్ట దశకు చేరుకోవడంతో నీరు అత్యవసరంగా అవసరమని పేర్కొన్నారు. స్వర్ణ జలా శయం నుంచి నీటిని విడుదల చేస్తే చెరువు నింపి పంటలను కాపాడుకునే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత శ్రీహరిరావు మంత్రుల దృష్టికి తీసుకెళ్లగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

కామారెడ్డి జిల్లాలో...

కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల రైతు లు సోమవారం కామారెడ్డి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్ కోతలు తగ్గించాలని రైతులు కోరుతున్న విద్యుత్ అధికారులు పట్టించుకో వడంలేదని రైతులు ఆరోపించారు. కరెంటు సరఫరాల్లో సాంకేతిక లోపంతో పాటు, రాత్రి సమయం లో ట్రిప్పులు చేస్తున్నారని దీంతో పంటలు ఎండుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 10 గంటలు కూడా పంట పొలాలకు  సరఫరా చేయడం లేదని రైతులు ఆరో పించారు. రైతులు రాస్తా రోకో చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు రైతుల వద్దకు చేరుకొని విద్యుత్తును నిరంతరంగా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. నిరంతరంగా విద్యుత్ సరఫరా చేపడతామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

మరిన్ని వార్తలు