బీర్కూర్‌లో ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్...
07-10-2026 | 10:23pm
14,200 నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం...
బాన్సువాడ, అక్టోబర్ 7 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బీర్కూర్ గ్రామంలో విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట ఆడుతున్న స్థావరంపై బుధవారం బీర్కూర్ ఎస్సై రాములు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఈ దాడిలో దాడిలో ఐదుగురు పేకాట రాయలతో పాటు రూ.14,200 నగదు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రాములు తెలిపారు. పట్టుబడిన ఐదుగురిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం తదుపరి చర్యలు చేపట ఉన్నట్లు ఎస్సై తెలిపారు.