మరణించిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి
ఆసిఫాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): మరణించిన, వలస వెళ్లిన, డబుల్‌గా నమోదైన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తొలగింపు చర్యలు చేపట్టాలని ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ పరిశీలకులు డా. యోగితారాణా(Dr. Yogita Rana) సూచించారు.
బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కె.హరిత, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మట్, డేవిడ్‌లతో కలిసి తహసిల్దార్లతో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. నోటీసుల పంపిణీ 100 శాతం పూర్తి చేసి, హియరింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. అర్హులైన ఒక్క ఓటరును కూడా తొలగించరాదని, తొలగించే ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించాలని ఆదేశించారు. జిల్లాలో 90 శాతానికి పైగా హియరింగ్ ప్రక్రియ పూర్తయిందని, గడువులోగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.