పేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ అండ
రామారెడ్డిలో 21 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
రామారెడ్డి, నవంబర్ 21 (విజయక్రాంతి): పేద కుటుంబాలకు చెందిన ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక భరోసా(Financial Security) కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల(Kalyana Lakshmi and Shaadi Mubarak schemes) ద్వారా రామారెడ్డి మండలంలోని 21 మంది లబ్ధిదారులకు(Beneficiaries) శనివారం చెక్కులు పంపిణీ చేశారు. రామారెడ్డి రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ స్వామి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
మండలంలోని గోల్లపల్లికి ఒకటి, రామారెడ్డికి 8, పోసానిపేటకు ఒకటి, గోకుల్తండాకు రెండు, కన్నాపూర్కు ఒకటి, కన్నాపూర్తండాకు ఒకటి, ఇస్సన్నపల్లికి రెండు, ఉప్పల్వాయికి మూడు, రంగంపేటకు రెండు చొప్పున మొత్తం 21 చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ నరేష్, సర్పంచ్ బండి ప్రవీణ్, ఉపసర్పంచులు,కాంగ్రెస్ నాయకులు, జీపీఓలు, దుర్గాప్రసాద్, దశరథ్, కిషన్, శ్రీకాంత్, స్వామి, గ్రామపంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.