విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు పోటీ పరీక్షలు
రాజపూర్: విద్యార్థులలో అంతర్గత్వంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు మీలో ఎవరు ప్రతిభావంతుడు అనే పోటీ పరీక్షలు నిర్వహించినట్లు మండల విద్యాధికారి సుధాకర్ తెలిపారు. శనివారం రంగారెడ్డి గూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) ఆధారిత ప్రతిభా పోటీలు నిర్వహించారు.కాంప్లెక్స్ పరిధిలోని 13 పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరై వివిధ అంశాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థులకు ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తరహాలో ‘మీలో ప్రతిభావంతుడు ఎవరు’ క్విజ్ పోటీలు ఆకట్టుకున్నాయని తెలిపారు.
విద్యార్థులకు విజ్ఞానాన్ని సృజనాత్మకత శక్తి పరీక్షించడానికి ఈ పోటీలు దోహద పడతాయని తెలిపారు. అనంతరం పోటీలలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరామిరెడ్డి, శ్రీధర్ రెడ్డి,సయ్యద్ ఇబ్రహీం, రాజేశ్వరి,రాజవర్ధన్ రెడ్డి ఉదయకుమార్,రవి, హెప్సీబా, ఉపాధ్యాయులు భీమ్ సింగ్,అభిలాష్, స్వర్ణలత,రాజేశ్వర్ రెడ్డి, రాఘవేందర్, రవీంద్ర నాయక్, ప్రభాకర్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.