బాధిత కుటుంబానికి మండలి ప్రతిపక్ష నేత పరామర్శ
మధుసూదనాచారి
హుజురాబాద్,నవంబర్21: (విజయక్రాంతి) : హుజురాబాద్ మండలం(Huzurabad Mandal) కాట్రపల్లి గ్రామానికి చెందిన కాసగోని మారయ్య మృతి పట్ల తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్, ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి సంతాపం వ్యక్తం చేశారు. శనివారం కాట్రపల్లి గ్రామానికి వెళ్లిన ఆయన మారయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మృతుని కుమారులు జై గౌడ అధికార ప్రతినిధి కాసగోని శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసగోని కిరణ్ కుమార్ గౌడ్లను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మారయ్య మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
మారయ్య మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని మధుసూదనాచారి ఆకాంక్షించారు.