ప్రత్యేక జాగ్రత్తలతో ఆయిల్ ఫామ్ తోటలో అధిక దిగుబడి

21-11-2026 | 10:18pm

ఉద్యానవన పట్టు పరిశ్రమల శాఖ డివిజన్ అధికారి శ్రీకాంత్ 

ములుగు, నవంబర్ 20 (విజయక్రాంతి) : ప్రత్యేక జాగ్రత్తలతో ఆయిల్ ఫామ్ తోటలో(Oil palm plantation) అధిక దిగుబడి సాధించవచ్చు అని ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ(Department of Horticulture and Sericulture) డివిజన్ అధికారి జక్కుల శ్రీకాంత్ వివరించారు. శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పలు పామాయిల్ తోటలను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలను రైతులకు(Farmers') వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో(impact of El Niño) అధిక ఉష్ణోగ్రతలు.. తక్కువ వర్షపాతం. వర్షాల మధ్య ఎక్కువ విరామం వల్ల మొక్కలు పెరుగుదల ఆకు అభివృద్ధి గెలల దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని అందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.

తోటలో నీటి కొరత రాకుండా ముందస్తు ప్రణాళికతో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కలకు నీటిని అందించి వేర్ల మండలం తడిగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. నీటి కుంటలు, వర్షపు నీటి నిలువలను వినియోగించుకోనేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కొబ్బరి పీచు సేంద్రీయ విద్యాలతో మల్చింగ్ చేయాలని, తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండేలా కల్ప మొక్కలు పెరుగుదల లేకుండా చూసుకోవాలన్నారు. నేల పరీక్ష ఆధారంగా ఎరువులు వేయాలని పశువుల ఎరువు కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులను ఉపయోగించడం ద్వారా అధిక దిగుబడి సాధ్యమన్నారు.

బోరాన్, మెగ్నీషియం, పొటాషియం లక్షణాలను గమనించి అందుకు తగ్గట్టుగా తెగుళ్లు, వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. వేసవికి ముందే నీటి వనరులను సిద్ధం చేసుకుని డ్రిప్ బ్లాక్ కేజీ తొలగించాలని, నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి అన్నారు. పక్వానికి వచ్చిన గెలలను సరైన సమయంలో కోయాలని, ఆకుపచ్చని ఆరోగ్యకరమైన ఆకులను అనవసరంగా తొలగించవద్దని సూచించారు. ఉద్యానవన శాఖ అధికారుల సూచనలు పాటించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

మరిన్ని వార్తలు