కాంగ్రెస్ నేతల ఎస్కేప్ కు.. కారోబార్ కు పోలీసుల వేధింపులు
- నకిలీ డెత్ సర్టిఫికెట్లలతో సంబంధంలేదు..
- తప్పుడు కేసు పెట్టారు
- బాధితుడు కారోబార్ చిలుముల రవి వెల్లడి
- ప్రాణహాని ఉంది, సీపీ కి ఫిర్యాదు చేస్తా..
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లిలో నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారం ప్రస్తుతం కలకలం రేపుతుంది. పోలీసుల విచారణ అనుమానుతల గుండెల్లో గుబులు రేపుతోంది. నకిలీ డెత్ సర్టిఫికెట్ల(Fake death certificates) ఘటనలో నలుగురు కార్యదర్శులు, ఆపరేటర్, కారోబార్ మెడకు చుట్టుకున్నది. ఈ కేసు ను తాళ్ళ గురజాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు డెత్ సర్టిఫికెట్ల రాకెట్(Police death certificate racket) కారకులను రక్షించేందుకు పోలీసులు బెదిరిస్తున్నారని కారొబర్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.
అక్రమంగా తనపై కేసు నమోదు చేశారని కారోబార్ చిలుముల రవి శనివారం మీడియాతో తన గోడును వెలిబుచ్చారు. బెల్లంపల్లి మండలం బుద్దాకుర్థు గ్రామపంచాయతీలో రవి కరోబార్ గా పనిచేస్తున్నాడు. నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాల కేసులో కావాలాని కాంగ్రెస్ నాయకులు ఇరికించారని ఆయన ఆరోపించారు. తమ పేర్లు బయట పెట్టవద్దని కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై గత మూడు రోజులుగా తాళ్ల గురిజాల ఎస్సై పోలీస్ స్టేషన్ కు పిలిపించి అదేపనిగా బెదిరిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ కి చెందిన సర్పంచ్ వెంబడి రాణి భర్త వెంబడి సురేష్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బత్తుల రవి పేర్లు చెప్పవద్దంటూ ఎస్సై వేధిస్తున్నాడని కన్నీరుమున్నీరు అయ్యాడు. బూదాకుర్డు గ్రామపంచాయతీలో జరిగిన నకిలీ ధ్రువ పత్రాల జారీ లో ఇంచార్జీ పంచాయతి సెక్రెటరీ శ్రీనివాస్ తో పాటు కాంగ్రెస్ నాయకులు బత్తులరవి, వెంబడి సురేష్ ల ప్రమేయం ఉందని ఆయన వెల్లడించడం సంచలనం రేపుతోంది. కాంగ్రెస్ నాయకులు,పోలీసుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఈ విషయంపై రామగుండం పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు రవి వెల్లడించారు.