జైపాల్ రెడ్డిని సన్మానించిన వాకర్స్ ప్రతినిధులు

21-11-2026 | 10:09pm

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి వాకర్స్ అసోసియేషన్(Kamareddy Walkers Association) ఆధ్వర్యంలో ఆర్కే డిగ్రీ కళాశాల సీఈవో వాకర్స్ అసోసియేషన్(RK Degree College CEO Walkers Association) అడ్వైజర్ డాక్టర్ జైపాల్ రెడ్డి నీ శనివారం వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,  రోటరీ క్లబ్ కామారెడ్డి, కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ , ఒలింపిక్ అసోసియేషన్, జిల్లా ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్, కామారెడ్డి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో   డా.M. జైపాల్ రెడ్డి  విశిష్ట సేవలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ  రాష్ట్ర ఫైనాన్స్ కమిటి సభ్యునిగా, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా  ఎన్నికైన  సందర్భంగా  ఆత్మీయంగా వాకర్స్ ప్రతినిధులు కామారెడ్డి డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు