ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు

21-11-2026 | 10:28pm

కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి బండారి గంగాధర్..

శివంపేట్ నవంబర్ 22 (విజయక్రాంతి ) : ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని(World Fishermens Day) పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గంగపుత్ర రాజ్యాధికార పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్‌లోని మత్స్యకారుల భవన్‌లో తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ మురళీకృష్ణను(Muralikrishna) మర్యాదపూర్వకంగా కలిసి మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని గంగపుత్రుల అభివృద్ధి, సంక్షేమం, హక్కుల సాధనకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గంగపుత్రులందరికీ నాయకులు మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గంగపుత్ర రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు మాదరబోయిన నరసయ్య, ఉపాధ్యక్షులు రాచకట్ల శంకర్ అలియాస్ శ్రీధర్, సలహాదారులు రానా బోయిన లక్ష్మణ్, కోశాధికారి పెద్దబోయిన దయానంద్, జిల్లా అధికార ప్రతినిధి బండారి గంగాధర్, బోర్డు డైరెక్టర్ మురళీకృష్ణ, గంగపుత్ర సంఘం సభ్యులు, తదితర పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు